Share News

అనపర్తిలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:57 PM

అనపర్తి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శివారు కొత్తూరు జగనన్న కాలనీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలో నివసిస్తున్న కుక్కల దుర్గాభవాని తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటుంది. బుధవారం సాయంత్రం ఆమె

అనపర్తిలో అగ్నిప్రమాదం
ప్రమాదం జరిగిన ఇంటి నుంచి వస్తున్న పొగలు

షార్ట్‌ సర్క్యూట్‌తో పేలిన ప్రిడ్జ్‌ సిలెండర్‌

అనపర్తి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శివారు కొత్తూరు జగనన్న కాలనీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలో నివసిస్తున్న కుక్కల దుర్గాభవాని తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటుంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంటి నుంచి పొగలు రావ డం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఒక్క సారిగా ప్రిడ్జ్‌ సిలండర్‌ పేలడంతో ఆ ప్రాంతమం తా భయందోళనలకు గురయ్యారు. స్థానికులు తలుపులు పగులగొట్టి మంటల ను అదుపు చేశారు. అనపర్తి అగ్నిమాపక సి బ్బంది అక్కడికి చేరుకుని నష్టం అం చనా వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిం ది. సుమారు రూ. 50 వేల వరకు ఆ స్తినష్టం ఉంటుం దని అంచనా వే స్తున్నామని, విద్యు త్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమా దం జరిగినట్లు భా విస్తున్నామని ఫైర్‌ అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Oct 29 , 2025 | 11:57 PM