Share News

ఫైల్స్‌.. క్లియరెన్స్‌!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:18 AM

కంప్యూటర్‌లో ఈ-ఆఫీస్‌ ద్వారా మంత్రులకు వచ్చే ఫైళ్లను పరిష్కరించే విషయంలో కందుల దుర్గేష్‌ ఏడో స్థానంలో నిలిచారు.

ఫైల్స్‌.. క్లియరెన్స్‌!

ఇన్‌చార్జి మంత్రి నిమ్మల ర్యాంక్‌ 2

మంత్రి కందుల దుర్గేష్‌ ర్యాంక్‌ 7

కలెక్టర్‌ 11.. జేసీ 21

జిల్లాలో నో పెండింగ్‌ ఫైల్స్‌

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

కంప్యూటర్‌లో ఈ-ఆఫీస్‌ ద్వారా మంత్రులకు వచ్చే ఫైళ్లను పరిష్కరించే విషయంలో కందుల దుర్గేష్‌ ఏడో స్థానంలో నిలిచారు. తన లాగిన్‌కు వచ్చిన ఫైళ్లను పరిశీ లించి వాటిని పరిష్కరిం చేందుకు దుర్గేష్‌ సగటున 3 రోజుల 9 గంటల 21 నిమిషాలు తీసుకుంటున్నారు. ఈ ఫైళ్ల పరిష్కా రంలో మంత్రులు, కలెక్టర్లు, జేసీలు పనితీరుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఏయే మంత్రులు తమ శాఖల పరిధిలో వచ్చిన ఫైళ్లను పరిశీలించి ఎలా పరిష్కరి స్తున్నారు? ఇందుకు ఎంత సమయం తీసుకుం టున్నారు వంటి వివరాలను వెల్లడిం చింది.ఈ మేరకు గతేడాది జూలై 15 నుంచి ఈ ఏడాది డిసెంబరు 9 వరకు ఆయా మంత్రుల ఈ ఫైళ్ల పరిష్కార వివరాలను ప్రకటించింది. జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ వద్ద సెప్టెంబరు 9 నాటికి ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌ కింద 6 ఫైల్స్‌ ఉన్నాయి.తర్వాత 325 ఫైళ్లు రిసీవ్‌ చేసుకోగా 316 పరిష్కరించారు. 38 వివిధ పరిష్కార దశల్లో ఉన్నాయి. ఈ ఆఫీస్‌ ద్వారా తన లాగిన్‌కు వచ్చిన ఫైళ్లను పరిష్కరించడంలో ఏడో స్థానంలో నిలిచారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫైళ్ల క్లియరెన్స్‌లో రెండో స్థానంలో ఉన్నారు. ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌ కింద ఆయన వద్ద 65 ఫైళ్లు ఉండగా తర్వాత 1514 పైళ్లను రిసీవ్‌ చేసుకున్నారు. మొత్తం 1546 పైళ్ల క్లియర్‌ చేశారు. కేవలం ఆయన ఫైళ్ల క్లియరెన్స్‌కు సగటున రెండు రోజుల 7 గంటల సమయం తీసుకున్నారు.

శెహబాస్‌..కలెక్టర్‌!

జిల్లాలో కలెక్టర్‌, జేసీ పర్యవేక్షణలో జరిగే ఈ-ఆఫీస్‌ ఫైళ్ల క్లియరెన్స్‌ చకచకా నడుస్తోంది. సెప్టెంబరు 9 నుంచి డిసెంబరు 9 వరకూ జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి వద్దకు 711 ఫైళ్లు రాగా 680 పరిష్కరించారు. ఆమె వద్దకు వచ్చిన పైళ్లను క్లియర్‌ చేయడానికి సగటున కేవలం ఒక్క రోజు సమయం తీసుకోవడం గమనార్హం. అంతకుముందు ఆమె వద్ద పెండింగ్‌ పైళ్లేమీ లేవు. ఆమె ర్యాంక్‌11గా ఉంది. రాష్ట్రంలో ఫైళ్లను కేవలం ఒకరోజు కొన్ని గంటల్లోనే క్లియర్‌ చేసిన 11 మంది కలెక్టర్లలో జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి కూడా ఉండడం గమనార్హం. ఇక జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘా స్వరూప్‌ కూడా ఫైళ్ల క్లియరెన్స్‌ బాగా చేశారు. సెప్టెంబరు 9 నుంచి ఈనెల 9 వరకూ మూడు నెలల్లో 737 పైళ్లు ఆయన వద్దకు రాగా వాటిలో 559 పరిష్క రించారు. వీటి పరిష్కారానికి ఆయన 6 రోజుల 2.30 గం టలు సమయం తీసుకోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన వద్ద 11 పైళ్లు ఉన్నాయి.ఆయన 21వ ర్యాంక్‌ సాధించారు. జిల్లా కలెక్టర్‌ అన్ని రంగాలకు సంబంఽధించిన ఫైళ్లను పర్యవేక్షి స్తారు. కొన్ని జాయింట్‌ కలెక్టర్‌ పరిధిలో ఉంటాయి. టూరి జం, ఇరిగేషన్‌, నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ పరిశ్రమలు,రైల్వే,హౌసింగ్‌, ఫారెస్ట్‌ వంటి అనేక కీలకమైన పైళ్లను ఆమె క్లియర్‌ చేస్తారు. జిల్లా టూ రిజం,ఇరిగేషన్‌, పరిశ్రమలకు సంబంఽధించిన అనేక ఫైళ్లు వస్తుంటాయి. జేసీ పౌరసరఫరాలు, ధాన్యం సేకరణ వంటి ఫైళ్లను క్లియర్‌ చేస్తున్నారు. భూసే కరణ వంటివి ఉంటాయి. మొత్తం మీద ప్రభుత్వం దృష్టిలో జిల్లాలో కలెక్టర్‌, జేసీ, కూ డా ఫైళ్ల క్లియ రెన్స్‌ చురుకుగానే వ్యవహరిస్తున్నారు.

కాగితరహిత పాలనే...ఈ-ఫైల్స్‌

ప్రభుత్వ పరిపాలనలో భాగంగా తొలుత వివిధ ఉద్యోగుల స్థాయి లో ఫైళ్లు తయారవుతాయి. ఏదైనా నిధుల విడుదలకు సంబంధించి ఆయా శాఖ నిర్ణయం తీసుకోవాలంటే ఆ వివరాలను ప్రస్తావిస్తూ తొలుత సెక్షన్‌లో ఫైలు సిద్ధమవుతుంది. ఈ ఫైలుకు అనుబంధంగా గతంలో ఈ తరహా నిర్ణయాలు, నిధులు విడుదల చేసి ఉంటే ఆ వివరాలను ప్రస్తావిస్తూ కొత్త ఫైలుకు అనుబంధంగా జత చేస్తారు. వీటిని సెక్షన్‌ నుంచి మంత్రిత్వశాఖలో అయితే కార్యదర్శులు,ఉన్నత కార్యదర్శుల నుంచి చివరకు మంత్రి వరకు ఫైలును పంపుతారు. ప్రతి దశలోను ఆయాశాఖలకు సంబంధించి కీలక అధికారుల నుంచి మంత్రి వరకు ఆ ఫైళ్లను చదివి ఆ తర్వాత ఆమోదం తెలుపుతూ సం తకాలు చేస్తారు. ఆ తర్వాతే ఉత్తర్వుల రూపంలో బయటకు వస్తాయి. అయితే కాగితరహిత పాలనలో భాగంగా కొన్నేళ్ల కిందట మునుపటి టీడీపీ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్‌ విధానం అమల్లోకి తెచ్చారు. గతేడాది ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఈ-ఆఫీస్‌ విధానం సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆఫీస్‌ అంటే కాగితాల రూపంలో ఫైళ్లను నిర్వహిస్తూనే అదే ఫైల్‌ను డిజిటల్‌ రూపంలో వివిధ దశల్లో ప్రభుత్వం స్థాయిలో ఆశాఖ పరిధిలో అధికా రులు,మంత్రులు, జిల్లాస్థాయిలో అయితే కలెక్టరేట్‌లో సంబంధించి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ నుంచి డీఆర్వో,జేసీ,కలెక్టర్‌కు, అలాగే జిల్లాలో ఆయా ప్రభుత్వశాఖల జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్‌కు డిజిటల్‌ ఫైళ్లను ఆమోదానికి పంపుతారు. సంబంధిత అధికారులు, కలెక్టర్లు, జేసీలు,మంత్రులకు ప్రభుత్వం లాగిన్‌లు కేటాయిస్తుంది.ఈ లాగిన్‌ లోకి కిందిస్థాయి నుంచి మంత్రి వరకు..జిల్లాలో వివిధ దశలు దాటి కలెక్టర్‌కు ఈ డిజిటల్‌ ఫైళ్లను కంప్యూటర్‌లో ఆయా ఉద్యోగులు, అధి కారులు తమ లాగిన్‌ల ద్వారా సెంట్‌ చేస్తారు. వీటిని చివరి దశగా మంత్రి లేదా కలెక్టర్‌ పరిశీలించి ఆమోదిస్తారు.

Updated Date - Dec 12 , 2025 | 12:18 AM