కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నం
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:39 AM
అధికారంలో ఉండగా అరాచకంతో ప్రజలను నానా ఇబ్బందుల పాల్జేసిన వైసీపీ ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టే నీచ రాజకీయాలకు ఒడిగడు తోందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు.
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
రాజమహేంద్రవరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యో తి): అధికారంలో ఉండగా అరాచకంతో ప్రజలను నానా ఇబ్బందుల పాల్జేసిన వైసీపీ ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టే నీచ రాజకీయాలకు ఒడిగడు తోందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కందుకూరి సంఘటన పట్ల కూ టమి నేతలంతా దిగ్ర్భాంతి చెందారు.ఆ కుటుంబా నికి అండగా నిలిచారని, కానీ పరామర్శల పేరుతో వైసీపీ కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోంద న్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయ ని, పోలీసు యంత్రాంగం అసాంఘిక కార్యక్రమా లను నియంత్రణ చేస్తోందని, కానీ వైసీపీ సొంత అజెండాతో వ్యవహరిస్తోందని అన్నారు.వైసీపీ హ యాంలో ప్రజలను హింసించారని, హత్యలు జరిగా యని, కానీ జగన్ తన ప్యాలస్‌ను వదిలి బయటకు రాలేదని విమర్శించారు. అంబటి రాంబాబు గురిం చి అందరికీ తెలుసని, ఇరిగేషన్ మంత్రిగా పోలవ రంలో గంప మట్టి వేయలేదని, కేవలం సంబరాలు చేసుకోవడానికి ఆయన మంత్రి పదవి చేపట్టార న్నారు.పంటలు ఎండిపోయినా, రైతుల ఆత్మహత్య లు జరిగినా పట్టించుకోలేదని, పవన్‌ను తిట్టడమే ఆయన పనియని, ఇరిగేషన్ శాఖకు ఆయన బాధ్య తగా వ్యవహరించలేదని అన్నారు.జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా కాపులకు ఒక్క లోనైనా ఇచ్చారా, విదేశీ విద్య కోసం రుణం ఇచ్చారనా అని ఎమ్మెల్యే బత్తుల ప్రశ్నించారు. కాపులను ఏమీ ఉద్ధరిం చరించారని నిలదీశారు.
కులాలను విడగొట్టేందుకు ప్రయత్నం: అనుశ్రీ
రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను, కులాల ను కలుపుకుని అందరి బాగా చూడాలని కూటమి ప్రభుత్వం పని చేస్తుంటే వైసీపీ మాత్రం ప్రజలను విడగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని జనసేన పార్టీ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ చార్జి అనుశ్రీ(అత్తి) సత్యనారాయణ విమర్శించారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులా లు, మతాల మధ్య చిచ్చుపెట్టి, ఆ మంట ల్లో చలి కాగాలని చూస్తోందన్నారు. కందుకూరి సంఘటన ను శవ రాజకీయం చేయవద్దని మృతుడి భార్య కోరగా, శవరాజకీయ పార్టీ అయిన వైసీపీ శవరాజ కీయమే చేస్తోందని మండిపడ్డా రు. వైసీపీ అధినేత జగన్, బఫూన్, సంబరాల అంబటి రాంబాబు, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ జక్కంపూడి రాజా శవ రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తు న్నారని అనుశ్రీ విమర్శించారు.