Share News

నాన్న తిరిగొచ్చాడు.. ఫాదర్స్‌ డే ఆనందమిచ్చాడు

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:13 AM

పిఠాపురం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయినా పిల్లలపై బెంగ, మమకారం పోలీసుల చొర వ ఆ వ్యక్తిని తిరిగి రప్పించాయి. ఫాదర్స్‌ డే రోజున తండ్రిని తిరిగి కలుసుకున్న ఆ పి ల్లల్లో ఆనందం వ్యక్తమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్‌ కాలనీకి చెందిన గీసాల శ్రీనివాస్‌ (

నాన్న తిరిగొచ్చాడు.. ఫాదర్స్‌ డే ఆనందమిచ్చాడు
శ్రీనివాస్‌ను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్న పిఠాపురం సీఐ శ్రీనివాస్‌

పిఠాపురం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయినా పిల్లలపై బెంగ, మమకారం పోలీసుల చొర వ ఆ వ్యక్తిని తిరిగి రప్పించాయి. ఫాదర్స్‌ డే రోజున తండ్రిని తిరిగి కలుసుకున్న ఆ పి ల్లల్లో ఆనందం వ్యక్తమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్‌ కాలనీకి చెందిన గీసాల శ్రీనివాస్‌ (39) మే 29న తన స్నేహితుడైన కాకి రమణ మోటారుసైకిలు తీసుకుని ధవళేశ్వరంలో ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలని చె ప్పి వెళ్లాడు. సాయంత్రం 4 గంటల వరకు భార్యతో ఫోనులో మాట్లాడి తర్వాత స్విచ్ఛా ఫ్‌ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన భా ర్య లక్ష్మి బంధువుల సహాయంతో వెదకగా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద శ్రీనివాస్‌ తీసుకువెళ్లిన బైక్‌, దుస్తుల బ్యాగు, చెప్పులు కనిపించాయి. దీ నిపై మే 31న లక్ష్మి భర్త అదృశ్యంపై ఫిర్యా దు చేయగా పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 3 బృందాలను ఏర్పాటు చేసి ఆ ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బైకు, దుస్తులు, ఇతర వస్తువులు వదిలిన అనం తరం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ వర కు వెళ్లినట్టు గుర్తించారు. అప్పుల బాధ ను ంచి విముక్తి పొందాలనే ఉద్దేశ్యంతో అక్కడి నుంచి కాశీ వెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడిని కాంటాక్ట్‌ చేసే రప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అదే సమయంలో భార్య, పిల్లలపై బెంగతో శ్రీని వాస్‌ ఆదివారం పిఠాపురం తిరిగివచ్చాడు. ఫాదర్స్‌ డే రోజున శ్రీనివాస్‌ను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. తమ తండ్రి తి రిగి రావడంతో ఆ పిల్లలు ఎంతో సంబరప డ్డారు. తండ్రిని తమ చెంతకు చేర్చిన సీఐ శ్రీనివాస్‌కు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 12:13 AM