ఆలయ కోనేరులో స్నానానికి దిగి తండ్రి కొడుకుల మృతి
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:50 AM
గండేపల్లి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఆలయ కోనేరులో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృ తిచెందారు. గండేపల్లి పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం... కాకినాడ జిల్లా గండేపల్లి మం డలం తాళ్లూరు గ్రామంలో జియ్యన్నమఠంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో సోమవారం మండలంలో బొర్రంపా లెం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు సాగి నల్ల బాబు(49), సాయి సంజయ్ శ్రీరామ్(19) స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతిచెందా
కాకినాడ జిల్లా తాళ్లూరులో ఘటన
గండేపల్లి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఆలయ కోనేరులో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృ తిచెందారు. గండేపల్లి పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం... కాకినాడ జిల్లా గండేపల్లి మం డలం తాళ్లూరు గ్రామంలో జియ్యన్నమఠంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో సోమవారం మండలంలో బొర్రంపా లెం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు సాగి నల్ల బాబు(49), సాయి సంజయ్ శ్రీరామ్(19) స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతిచెందారు. తొండంగి మండలం వలసపాకలు చెందిన తమ బంధువులు మృతి చెందడంతో పరామర్శ కెళ్లి తిరిగి వస్తూ సాయంత్రం కో నేరులో స్నానానికి దిగగా ఈ ఘటన జరిగింది. వా రిని గుర్తించిన స్థానికు లు రక్షించే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం తో జగ్గంపేట సీఐ వైఆర్ కె.శ్రీనివాస్, గండేపల్లి పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే తండ్రి కొడుకులు మృతి వార్త తెలియడంతో బొర్రపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు ను కోల్పోయామని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సాయి సంజయ్ శ్రీరామ్ వై జాగ్‌లో బీటెక్ చదువుకుంటున్నాడని తెలిసింది.