Share News

రైతుల సంక్షేమమే లక్ష్యం: నల్లమిల్లి

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:36 AM

రైతుల సంక్షేమమే లక్ష్యం గా మార్కెట్‌ కమిటీ పనిచేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ జుత్తుక సూర్యకుమారి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు.

రైతుల సంక్షేమమే లక్ష్యం: నల్లమిల్లి
మార్కెట్‌ కమిటీ ప్రగతిని పరిశీలిస్తున్నఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి, డిసెంబరు 27 (ఆంరఽధజ్యోతి): రైతుల సంక్షేమమే లక్ష్యం గా మార్కెట్‌ కమిటీ పనిచేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ జుత్తుక సూర్యకుమారి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. రైతు బజార్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ చేసిన తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు. ముందుగా ఏఎంసీ మాజీ చైర్మన్‌ నల్లమిల్లి సూరారెడ్డి మృతికి కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అలాగే రైతులకు సబ్సిడీపై అందించే టార్పాలిన్‌లను నాలుగు మండలాల ఏవోలకు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ కోనాల వెంకటరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా అనపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన వీర్‌ బాల దివస్‌ కార్యక్రమాని కి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విచ్చేసి ప్రసంగించారు. దేశం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని, వారిలో ఫతే సింగ్‌, జోరావర్‌ సింగ్‌ సజీవ సమాధి అయ్యారని, వారి త్యాగానికి గు ర్తుగా ప్రధాని మోదీ డిసెంబరు 26ను వీర్‌ బాల దివస్‌గా ప్రకటించారన్నారు. ముందుగా వీరబాలల చిత్రపటాల వద్ద నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ సీడీపీవో కృష్ణవేణి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.విద్యార్థుల ఫొటో ఎగ్జిబిషన్‌ ఆకట్టు కుంది. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్‌ రవికిరణ్‌, నాయకులు సూర్యకిరణ్‌, రజని, తమలంపూడి సుధాకరరెడ్డి, మల్లిడి సురేంద్రరెడ్డి, గొల్లు హేమతులసి, గిరిడా గంగాభవాని, జుత్తుక సూర్యకుమారి, సిరసపల్లి నాగేశ్వరరావు, రావా డ నాగు,ఎన్‌ఆర్‌కే ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:36 AM