రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:08 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని ఏఎంసీ కార్యాలయంలో నూతన కా ర్యవర్గం కొలువుదీరింది. ముందుగా కమిటీ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే న ల్లమిల్లి, చైర్ పర్సన్‌గా జుత్తుగ సూ ర్యకుమారి, వైఎస్ చైర్మన్‌గా కోనాల వెంకటరెడ్డి, డైరెక్టర్లుగా 14 మందితో బాటు సర్పంచ్ వారా కుమారిలతో కార్యదర్శి శ్రీనివాస్ ప్రమాణం చే యించారు.
అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని ఏఎంసీ కార్యాలయంలో నూతన కా ర్యవర్గం కొలువుదీరింది. ముందుగా కమిటీ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే న ల్లమిల్లి, చైర్ పర్సన్‌గా జుత్తుగ సూ ర్యకుమారి, వైఎస్ చైర్మన్‌గా కోనాల వెంకటరెడ్డి, డైరెక్టర్లుగా 14 మందితో బాటు సర్పంచ్ వారా కుమారిలతో కార్యదర్శి శ్రీనివాస్ ప్రమాణం చే యించారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యేతో బాటు కూటమి నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, నాయకులు జుత్తుక కృష్ణ, దత్తుడు శ్రీను, వెలుగుబంటి సత్తిబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మేలుకే జీఎస్టీ సరళీకృతం
కాగా అనపర్తి వర్తక సంఘం కళ్యాణ మండపంలో జిల్లా వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లమిల్లి విచ్చేసి ప్రసంగించారు. దేశ ప్రజలపై భారం తగ్గించాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ జీఎస్టీ ని సరళీకృతం చేశారని, దీని వల్ల అనేక రకాల మందుల ధరలు తగ్గాయన్నారు. దేశంలో రక్షణ రంగాన్ని పటిష్టం చేయడమే కాకుండా దేశాన్ని ఆర్థికంగా నాలుగో స్థానానికి తీసుకురావడంలో మోదీ పాత్ర కీలకమని అన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య శాఖ అధికారులు జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు కొవ్వూ రి వెంకటరామారెడ్డి, సత్తి వెంకటరామారెడ్డి, ఏఎంసీ జుత్తుక సూర్యకుమారి, రావాడ నాగు తదితరులు పాల్గొన్నారు.