యూరియా... అగచాట్లు ఏంటయ్యా!
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:05 AM
గొల్లప్రోలు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇటీవల భారీ వర్షాలు, వరదల అనంతరం యూరియాకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిం ది. ముంపునకు గురైన పొలాల్లో బూస్టర్ డోస్‌గా యూరియా వేయాలన్న వ్యవసాయశాఖ సూచనలు, అదే సమయంలో వ
వర్షంలోనే గొల్లప్రోలు సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు
గొల్లప్రోలు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇటీవల భారీ వర్షాలు, వరదల అనంతరం యూరియాకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిం ది. ముంపునకు గురైన పొలాల్లో బూస్టర్ డోస్‌గా యూరియా వేయాలన్న వ్యవసాయశాఖ సూచనలు, అదే సమయంలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతుండడంతో ఎరువు వేయాల్సిన అవసరం ఏర్పడింది. కొద్ది రోజులుగా యూరి యా ప్రవేటు దుకాణాల్లో అందుబాటులో లేకపోవడంతో సొసైటీలు, రైతు సేవా కేంద్రాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సొసైటీ వద్ద సోమవారం యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. దీంతో సోమవారం రాత్రి 20 టన్నులు, మంగళవారం ఉదయ మే మరో 20 టన్నుల యూరియాను గొల్లప్రోలు సొసైటీకి పంపారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు తెల్లవారుజాము నుంచే సొసైటీ వద్ద బారులు తీరారు. సుమారు అరకిలోమీటరు మేర రైతులు క్యూలో నిలుచున్నారు. రైతుకు రెండు బస్తాలు వంతున పంపిణీ చేశారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా రైతులు బారులు తీరడం గమనార్హం. యూరియాకు ఎటువంటి కొరత లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ స్పష్టం చేశారు. గొల్లప్రోలు సొసైటీ వద్ద రైతులు బారులు తీరిన విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం ఇక్కడకు చేరుకుని దగ్గరుండి రైతులకు యూరియా పంపిణీ చేయించారు. వర్మ వెంట టీడీపీ గొల్లప్రోలు పట్టణాధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు తదితరులు ఉన్నారు.