రైతుల కష్టాలు చెప్పు'తున్నాయి!
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:45 AM
ఎటపాక, సెప్టెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): యూరియా కొరత...దాని కోసం రైతులు పడుతున్న కష్టాలకు ఈ చిత్రాలే నిదర్శనం. అల్లూరి జిల్లా ఎటపాక మండలం తోటప
యూరియా కోసం అర కిలోమీటరు క్యూ
ఎటపాక, సెప్టెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): యూరియా కొరత...దాని కోసం రైతులు పడుతున్న కష్టాలకు ఈ చిత్రాలే నిదర్శనం. అల్లూరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి రైతు సేవా కేంద్రంలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. దీంతో చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారుజామున 3 గంటలకే రైతు సేవా కేంద్రానికి వచ్చారు. యూరియా ఎరువులు పొందేందుకు తమ వంతుగా చెప్పులతో క్యూ కట్టారు. సుమారు అర కిలోమీటరు వరకు చెప్పులతో క్యూ కనిపించింది.