రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గిడ్డి
ABN , Publish Date - May 21 , 2025 | 12:39 AM
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.
పి.గన్నవరం, మే 20(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్న వరం శివారు తాటికాయలవారిపాలెం బూరుగు చానల్ పరిధిలో మంగళవారం ఆయన పూడిక తీత పనులను ఎమ్మెల్యే ప్రారంభించి అనంత రం మాట్లాడారు. కాల్వులకు నీటి కట్టేయడంతో తొలుత పూర్తిగా అస్థవ్యస్థంగా ఉన్న కాల్వల్లో పూడికతీత పనులు ప్రారంభిచామన్నారు. తాటి పాక ఇరిగేషన్ సెక్షన్ పరిధిలో పి.గన్నవరం, మామిడికుదురు మండలాలకు సంబంధించి కొర్లగుంటలో ట్రఫ్ నిర్మాణానికి రూ.10లక్షలు, బూరుగుచానల్, బొడపాటి చానల్ పరిధిలో పూడికతీత పనులకు రూ.5లక్షలు, హస్పటల్ చానల్ పరిధిలో పూడికతీతకు రూ.3లక్షలు, ఏనుగుకాల్వ, ముంగండపాలెం కాల్వల్లో పూడి కతీతకు రూ.4లక్షలు, మొండెపులంక తూర్పు, పశ్చిమ కాల్వల్లో పూడికతీతకు రూ.4లక్షలు, లూటుకుర్రు, మాకనపాలెం కాల్వల్లో పూడిక తీతకు రూ.4లక్షల నిధులు మంజూరైనట్లు తెలి పారు. కాల్వలకు నీరువచ్చే నాటికి పనులు పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకో వాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ ఆర్.నాగేంద్రకుమార్, జేఈ సుం దర్‌సింగ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్య క్షుడు చొల్లంగి సత్యనారాయణమూర్తి, నీటి సం ఘం అధ్యక్షుడు కె.సత్యనారాయణరాజు, సం సాని పెద్దిరాజు, వాసంశెట్టి కుమార్, శేరు శ్రీను బాబు, తాటికాయల శ్రీనివాసరావు, నేరెడిమిల్లి రఘు, కోట రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.