Share News

ఫార్మా కౌన్సిల్‌ ఎన్నికలకు సన్నాహాలు

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:20 AM

జీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఫార్మా కౌన్సిల్‌ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. 15 ఏళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మా ఉద్యోగులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐఏఎస్‌ అధికారి దినేష్‌కుమార్‌ ఎన్నికల అధికా రిగా వ్యవహరిస్తుండగా ఈ నెల పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 24న పోస్టల్‌ బ్యాలె ట్‌లు అందుకోవడానికి తుది గడువుగా ని

ఫార్మా కౌన్సిల్‌ ఎన్నికలకు సన్నాహాలు

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మా ఉద్యోగులు

ఈనెల 24 పోస్టల్‌ బ్యాలెట్లు అందుకోవడానికి తుది గడువు

27న ఫలితాలు

ఎన్నికల అధికారిగా ఐఏఎస్‌ అధికారి దినేష్‌కుమార్‌

జీజీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఫార్మా కౌన్సిల్‌ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. 15 ఏళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మా ఉద్యోగులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐఏఎస్‌ అధికారి దినేష్‌కుమార్‌ ఎన్నికల అధికా రిగా వ్యవహరిస్తుండగా ఈ నెల పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 24న పోస్టల్‌ బ్యాలె ట్‌లు అందుకోవడానికి తుది గడువుగా నిర్ణయించారు. ఎన్నిక జరిగి సుదీర్ఘకాలం కావడంతో పలు వివాదాలు రాజుకుంటున్నాయి. ఉ మ్మడి జిల్లాలో 12 వేలమందికి పైగా ఫార్మ సిస్టులు ఉండగా వారిలో 6500 మంది రిజిస్ర్టేషన్‌లు పొందిఉన్నారు. ఈ రిజిస్ర్టేషన్‌లు పొందిన వారికి మాత్రమే ఓటు హ క్కు లభించింది. దీంతో ఓటు హక్కు పొం దని వారు తమ రిజిస్ర్టేషన్‌లను సుదీర్ఘకాలంగా కౌన్సిల్‌లో పెండింగ్‌ పెట్టారని, ఉదే ్దశ్యపూర్వకంగా తమకు ఓటు రాకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ ఎన్ని కల్లో 6 ప్యానల్‌లు పోటీ చేయనున్నాయి. ఈనెల 27తేదీన ఫలితాలు వెలువడతాయి.

Updated Date - Dec 17 , 2025 | 12:20 AM