Share News

విజన్‌ చంద్రుడు!

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:35 AM

ఎన్నికల్లో ఏం చేస్తారో చెప్పారు.. అధికా రంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు చేసి చూపి స్తున్నారు..

విజన్‌ చంద్రుడు!
రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలో పారిశ్రామిక పార్కును వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు చిత్రంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కలెక్టర్‌ కీర్తి చేకూరి, జేసీ మేఘా స్వరూప్‌, కూటమి నాయకులు

మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

రాజమహేంద్రవరం, నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి) : ఎన్నికల్లో ఏం చేస్తారో చెప్పారు.. అధికా రంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు చేసి చూపి స్తున్నారు.. తన విజనేంటో ప్రజలకు తెలియజేస్తు న్నారు. ప్రతి ఒక్కరినీ అభివృద్ధి చేసే దిశగా అడు గులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇంటికో పారిశ్రామికవేత్త తయారవ్వాలనే లక్ష్యంతో కూట మి ప్రభుత్వం నియోజకవర్గానికో పారిశ్రామిక వాడను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. 2030నాటికి ఒక వ్యవస్థాప కుడు- ఒక కుటుం బం పేరుతో ప్రయత్నాలు ఆరంభించారు. అందులో భాగంగా మంగళవారం జిల్లాలో రాజమండ్రి రూరల్‌ ధవళేశ్వరం, గోపాలపురం నియో జకవర్గం చెరుకుమిల్లి, నిడదవోలు బసివి రెడ్డిపేటలో మూడు ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ లను సీఎం చంద్ర బాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రా మికవేత్త తయారుకావాలన్నదే తన లక్ష్యమ న్నారు. దానిలో భాగంగానే ఈ కాంప్లెక్స్‌లు నిర్మి స్తున్నామని తెలిపారు. ధవళేశ్వరంలో 2 ఎకరాల్లో రూ.15 కోట్లతో 26 యూనిట్లను నెలకొల్పే విధం గా ఎఫ్‌ఎఫ్‌సి నిర్మించనున్నారు.చెరుకు మిల్లిలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2.5 ఎకరాల్లో ఎఫ్‌ఎఫ్‌సీ నిర్మించను న్నారు. నిడదవోలు బసివి రెడ్డిపేటలో 2 ఎకరాల్లో రూ.13.12 కోట్లతో 26 యూనిట్లుగా సరిపడ భవనం నిర్మిస్తారు. సుమారు 6 నెలలో ఎఫ్‌ఎఫ్‌సి కాంప్లెక్స్‌ను పూర్తి చేయనున్నట్టు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 12 , 2025 | 12:35 AM