Share News

ఫ్యాక్టరీ ధరలకే పాడి రైతులకు పశువుల దాణా

ABN , Publish Date - Nov 14 , 2025 | 02:34 AM

కూటమి ప్రభుత్వంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి జిల్లా కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఫ్యాక్టరీ ధరలకే పాడి రైతులకు పశువుల దాణా

అమలాపురం రూరల్‌/పి.గన్నవరం, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి జిల్లా కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రం లోనే తొలిసారిగా జిల్లాలో పాడిరైతుకు తక్కువ రేటుకు నాణ్యమైన పశుదాణాను అందించా లనే లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో పాలు దిగు బడిని పెంచి పాడిపరిశ్రమను మరింత అభి వృద్ధి చేసేందుకు ఈ మార్గాన్ని ఎంపిక చేశారు. దీంతో కలెక్టర్‌ పలుదఫాలుగా పశువైద్యాధికా రులతో చర్చలు జరిపి దళారులు ప్రమేయం లేకుండా నేరుగా దాణా తయారీ కేంద్రం నుం చి రైతుకు దాణాను అందించాలనే లక్ష్యంతో సొసైటీలను ఎంచుకున్నారు. మొదటగా జిల్లా లో రామచంద్రపురం, పి.గన్నవరం, మలికిపురం మండలాల్లో పలు సొసైటీలకు 75 టన్నుల దా ణా పంపించారు. 50కిలోల పశుదాణా బ్యాగ్‌పై ‘కోనసీమ పశువుల దాణా - అధిక పాలకు పోషణ’ అనే లోగోతోపాటు జిల్లా పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ సమన్వయంతో అని ము ద్రించారు. ఈ తరహా పశుదాణా పంపిణీ కార్య క్రమం రాష్ట్రంలోనే కోనసీమ జిల్లాలోనే ప్రారం భించడంతో విజయవంతమైతే మిగిలిన జిల్లా లు కూడా కోనసీమను ఆదర్శంగా తీసుకోను న్నాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణా సరఫరా చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించినట్టు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ కె.వెంకట్రావు తెలిపారు. ఫ్యాక్టరీ ధరలకే పాడి రైతులకు పశువుల దాణాను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. తొలివిడతలో జిల్లాలోని నలభై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పశువుల దాణా అందుబాటులో ఉంచామన్నారు. మలి విడతలో జిల్లాలోని మిగిలిన పీఏసీఎస్‌లలో అందుబాటులోకి తెస్తామన్నారు. అతితక్కువ ధరకు అన్ని పోషక విలువలతో కూడిన 50 కిలోల పశువుల దాణా బస్తాను రూ.1050కే సొసైటీల్లో అందుబాటులో ఉంచినట్టు డాక్టర్‌ వెంకట్రావు తెలిపారు. ఎ.వేమవరప్పాడులో గురువారం మండల పశువైద్యాధికారి డాక్టర్‌ మాధురి ఆధ్వర్యంలో ఉచిత పశుగర్భకోశ వ్యాఽధుల శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఉపసర్పంచ్‌ వాకపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన శిబిరానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వెంకట్రావు, మండపేట పశుశిక్షణ శిబిరం సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ వై.వెంకటేష్‌, ఉపసంచాలకుడు డాక్టర్‌ కర్నీడి మూర్తి, డాక్టర్‌ మనోజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరంలోని పలు విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకట్రావు మాట్లాడుతూ పశువుల దాణా కావాల్సిన వారు సమీపంలోని వైద్య సహాయకులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 14 , 2025 | 02:34 AM