Share News

మందుబాబులు ‘సురక్ష’తం!

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:26 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యాన్ని పారించారు. మందుబాబుల జేబులు, ఆరోగ్యా లకు చిల్లు పెట్టారు.అయితే కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని ఆసాంతం మార్చేసింది.

మందుబాబులు ‘సురక్ష’తం!

ఏపీ ఎక్సయిజ్‌ సురక్షా యాప్‌

ఇక నకిలీ మద్యానికి చెక్‌

క్యూఆర్‌ కోడ్‌తో బాటిల్‌ చిట్టా

నకిలీపై ఫిర్యాదు చేయవచ్చు

నాణ్యతపై కూటమి ఛాన్స్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యాన్ని పారించారు. మందుబాబుల జేబులు, ఆరోగ్యా లకు చిల్లు పెట్టారు.అయితే కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని ఆసాంతం మార్చేసింది. నాణ్య మైన సరుకు, బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చి ంది. ధరలను తగ్గించింది. మందుబాబులకు నిజం తెలియడం ప్రధానమనే ఉద్దేశంతో ప్రభు త్వం సురక్ష ఏపీ ఎక్సయిజ్‌ డిపార్ట్‌మెంట్‌ అనే యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మద్యం తయారీ వివరాలు పక్కాగా తెలుసుకో వచ్చు. ఒకవేళ నకిలీ అయితే ఇట్టే పట్టేస్తుంది. ఆపై ఎక్సయిజ్‌ అధికారులు ఆ తయారీ, విక్ర యదారుల పనిపడతారు.యాప్‌పై ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో ..

వైసీపీ ప్రభుత్వం ఎక్సయిజ్‌ శాఖను అతలా కుతలం చేసిన విషయం తెలిసిందే. నాసిరకం మద్యాన్ని ఐదేళ్లు పారించడానికి స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ-సెబ్‌) అంటూ ఓ కొత్త విభాగాన్ని సృష్టించారు. మద్యం అమ్మ కా లు, అక్రమాలపై అసలు నిఘా, తనిఖీలు, చర్య లు లేకుండా చేశారు. నాసిరకం మద్యాన్ని అధిక రేట్లతో తాగించారు. సొంత తయారీ మ ద్యాన్ని తాగించడానికి బ్రాండెడ్‌ మద్యా న్ని రాకుండా చేశారు. ఎంసీ వంటి అంత ర్జాతీయ కంపెనీలు సైతం రాష్ట్రానికి ఐదేళ్లు రాలేదు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అన్ని బ్రాండ్లు రాష్ట్రంలో అడుగుపెట్టాయి. ఇప్పుడు నాణ్యమైన సరుకు దొరుకుతున్నా..నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ అంటూ వైసీపీ నాయకులు యాగీ చేస్తున్నారు.

కూటమి వచ్చాక

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌ పిచ్చి బ్రాండ్ల తయారీకి అడ్డుకట్ట వేశా రు.తమిళనాడు, కర్నాటక, కేరళ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లోని మద్యం పాలసీపై ఉన్నతా ధికారులతో అధ్యయనం చేయించారు. కమిటీ నివేదిక ఆధారంగా కొత్త పాలసీ వచ్చింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రైవేటు షాపులు, పాత మద్యం బ్రాండ్లు అం దుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌, ఖాసా డిస్టలరీస్‌ కంపెనీ, పీరి డిస్టలరీస్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. నాణ్యమైన బ్రాండ్లు సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చాయి.ప్రస్తుతం 200 వరకూ బ్రాండ్లు అం దుబాటులో ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదా వరిలో 400 వరకూ ప్రైవేటు మద్యం దుకా ణా లు, 30 బార్లు ఉన్నాయి. నెలకు రూ.300 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇప్పుడు సురక్ష యాప్‌

నకిలీ మద్యం తయారీ, విక్రయాలు లేకపో యినా..ఒకవేళ ఎక్కడైనా చాటుమాటుగా అధికా రుల కళ్లుగప్పి చేస్తున్నా వారి పనిపట్టడానికి ఏపీ ఎక్సయిజ్‌ సురక్ష యాప్‌ని ప్రభుత్వం అం దుబాటులోకి తెచ్చింది.దీంతో నాణ్యతపై ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. యాప్‌ ద్వారా సుల భంగా తెలుసుకోవచ్చు.ఎక్కడ, ఏ పరిమా ణంలో, ఏ బ్రాండ్‌ మద్యం కొనుగోలు చేసినా వినియోగదారుడు ఠక్కున ఆ బాటిల్‌లో మద్యం వివరాలు తెలుసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సురక్ష యాప్‌ ఏపీ ఎక్సయిజ్‌ డిపార్ట్‌మెంట్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెల్‌ఫోన్‌లో ఉండే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌తో బాటిల్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే బ్రాండ్‌ పేరు, లైసెన్స్‌, తయారీ స్థలం తదితర వివరాలు వస్తాయి. ఒకవేళ మద్యం నకిలీ అయితే చట్టబద్ధ మైన హెచ్చరిక మెసేజ్‌ వస్తుంది.అలాగే ‘డిటెయిల్స్‌ నాట్‌ ఫౌండ్‌’ అని వచ్చినా నకిలీ మద్యమనే అర్ధం చేసుకోవాలి. యాప్‌లోని సమాచారం రాష్ట్రస్థాయి అధికారులకు చేరుతుంది. వినియోగదారుడు ఎక్సయిజ్‌ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

సురక్షా యాప్‌తో సులభంగా

సురక్షా-ఏపీ ఎక్సయిజ్‌ యాప్‌తో మద్యం నాణ్యత సులభంగా తెలు సుకోవచ్చు.నకిలీ మద్యం తయారీ, విక్రయాలు లేవు. ఎప్ప టికప్పుడు మద్యం దుకాణాలు,బార్లు తనిఖీ లు చేసి నమూనాలను ల్యాబ్‌లకు పంపిస్తున్నాం. ఇప్పటి వరకూ నకిలీ ఆనవాళ్లు లభ్యం కాలేదు.నిరంతర నిఘాతో పాటు ప్రత్యే క తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. అక్రమ మద్యం, సారా సమాచారాన్ని ఎక్సయిజ్‌ అధికా రులకు చేరవేస్తే వివరాలు గోప్యత పాటిస్తాం.

- లావణ్య, ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌

Updated Date - Oct 18 , 2025 | 01:26 AM