Share News

ఉన్నారా..సార్‌!

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:45 AM

జిల్లాలో అబ్కారీ అధికారులు, సిబ్బంది పరి స్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయా రైంది.

ఉన్నారా..సార్‌!

సిబ్బందిపై పొలిటికల్‌ ఎఫెక్ట్‌

ఊహూ అంటే ట్రాన్స్‌ఫర్‌

నలిగిపోతున్న అధికారులు

కుదురుకునే లోపే సీటు కదలిక

ఆ రెండు స్టేషన్లలో ఇదీ తీరు

6 నెలలు తిరగకముందే మళ్లీ

నేడో,రేపో బదిలీల బంతాట

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అబ్కారీ అధికారులు, సిబ్బంది పరి స్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయా రైంది. కరవమంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్నట్టుగా విధులు ఉండ డంతో నెట్టుకురావడం కష్టమవుతోందని అంటు న్నారు.రాజకీయ నాయకులు చల్లుకుంటున్న బురద తమ యూనిఫాంకి రాస్తుండడం.. వాటి ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసు కొని కుర్చీలో కుదుటపడేలోపుగానే బదిలీ అంటూ కదుపుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.

బదిలీ భయం...

బదిలీ అంటే ఉద్యోగితో పాటు కుటుంబం కదలాల్సి ఉంటుంది.ఈ క్రమంలో పిల్లల చదు వులు, ఇంట్లో వృద్ధులైన, అనారోగ్యంతో ఉన్న కుటుంబీకుల విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్సయిజ్‌ శాఖను వైసీపీ ప్రభుత్వం ఎస్‌ఈబీ అంటూ ఓ కొత్త పదాన్ని సృష్టించి దానిలో కలిపేసింది. కూటమి ప్రభు త్వం వచ్చిన తర్వాత అబ్కారీ శాఖకు మళ్లీ ఆయువు పోసింది. అప్పటి వరకూ పొరుగు గొడుగులో అంతర్మథనంతో విధులు నెట్టుకొ చ్చిన అధికారులు, సిబ్బంది హమ్మయ్య అనుకు న్నారు.కానీ జిల్లా కేంద్రం రాజమహేంద్రవ రం సిటీ, రూరల్‌కి సంబంధించి ఇంకా కుదురు కోలేదు. రాజకీయ నాయకుల ఎత్తుగడల్లో అధి కారులను పావులుగా చేస్తున్నారు. మరో వైపు మద్యం వ్యాపారుల వైరాల్లోకి అబ్కారీ శాఖను లాగుతున్నారు. దీంతో నిఘా వర్గాలు కూపీ లాగడం ఆరంభించాయి. మరో వైపు ఏసీబీ అధికారులు ఓ వ్యాపారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారని సమాచారం. ఈ క్రమంలో సిటీ, రూరల్‌కి సంబంధిం చిన నార్త్‌,సౌత్‌ స్టేషన్ల లో మొత్తం సిబ్బందిని బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావించారు.

ఆ రెండూ స్టేషన్లలో సమస్యలే..

సాధారణంగా ఎవరిపై అయినా ఆరోపణ వస్తే.. అది రుజువు అయితే వారిపై చర్యలకు ఉపక్రమించడం రివాజు. కానీ జిల్లా కేంద్రంలో మాత్రం రెండు స్టేషన్లనూ అతలాకుతలం చేసే స్తున్నారు. ఈ ఏడాది మే నెలలో కానిస్టేబుల్‌ దగ్గర నుంచీ సీఐల వరకూ మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు. రెండు స్టేషన్లకు రెగ్యులర్‌ సీఐ, ఎస్‌ఐలను ఇవ్వలేదు. సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. సౌత్‌ స్టేషన్‌కి రెండు నెలల కిందట ఆల మూరు సీఐ ని ఇన్‌చార్జిగా నియమించారు. ఓ ఎస్‌ఐని తర్వాత ఇచ్చారు. పక్షం కిందట ఆయ నను మళ్లీ ఆలమూరు పంపేసి స్టేషను బాధ్య తలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌లోని ఓ ఇన్‌స్పెక్ట ర్‌కి అప్పజెప్పారు. నార్త్‌ స్టేషనుకు రెగ్యులర్‌ సీఐ లేరు. ఇప్పటికీ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సీఐతోనే అదనపు విధులు నిర్వర్తింపజేస్తున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న రంపచోడవరం ఎస్‌ ఐని ఓ నెల కిందట ఈ స్టేషను విధులు చూడాలని పంపించారు. అధికారులు, సిబ్బంది పరిస్థితి ఇలా అస్తవ్యస్తంగా ఉంది.

మళ్లీ బదిలీనా!

ఇప్పుడు ఆరు నెలలు తిరక్కుండానే మళ్లీ వీళ్లందరినీ బదిలీ చేస్తారని తెలుస్తోంది. నేడో, రేపో ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అధికారులు, సిబ్బంది ఆవేదన చెందుతు న్నారు.ఇలా ఆరోపణలు వస్తే అలా అందరినీ బాధ్యులను చేయ డం ఎంత వరకూ సమంజసమనే ప్రశ్న వినవస్తోంది. బదిలీ ఉత్తర్వుల్లో ‘పరిపాలన సౌలభ్యం’, ‘తర్వాతి ఉత్తర్వులు అందే వరకూ’ అని మాత్రమే స్పష్టం చేస్తున్నారు.ఇలా గంప గుత్తగా బదిలీలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మళ్లీ కొత్తగా వచ్చే అధి కారి సీటులో టవల్‌ సర్దుకొనేలోపే ఉంటారో వెళ్లిపో తారో తెలియని పరిస్థితి నడుస్తోంది. దీంతో ఎన్‌ ఫోర్స్‌మెంట్‌పై ప్రతి కూల ప్రభావం పడుతోంది. మరోవైపు అధికా రులకు బెది రిం పు మెసేజ్‌ పంపే స్థాయికి పలువురు వ్యాపా రులు తెగించారు. కోర్టు కేసులూ, వివరణలు ఇచ్చుకోవడం ఉద్యోగులకు నిత్యకృత్యమైపోయిం ది.ఈ గలాటా తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్లిపోతామని కొందరు అంటుం టే.. కొత్త వారు రావడానికి ఇష్టపడడం లేదు. మొత్తానికి రాజకీయ నాయకుల చేష్టలు, మద్యం వ్యాపారుల గొడ వలు జిల్లాలోని అబ్కారీని రోడ్డుకీడుస్తున్నాయి. నాయకులను, మద్యం వ్యాపా రులను గాడిలో పెట్టకపోతే అబ్కారీలో విధులకు తూర్పు తిరిగి వెతుక్కోవాల్సిందే!.

Updated Date - Nov 09 , 2025 | 12:45 AM