జక్కంపూడి రాజా హౌస్ అరెస్టు
ABN , Publish Date - Jul 23 , 2025 | 01:35 AM
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
అడ్డుకున్న పోలీసులు
రాజమహేంద్రవరం సిటీ, జూలై 22( ఆంధ్రజ్యోతి) : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలో ఏపీ పేపరుమిల్లు కార్మికులకు వేతన ఒప్పందం విషయంలో మంగళవారం నుంచి నిరవధిక దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.ఈ మేరకు మంగళ వారం తెల్లవారుజామున 3 గంటల సమయ ంలో త్రీటౌన్ పోలీసులు కృష్ణసాయి కల్యాణ మండపానికి చేరుకుని జక్కంపూడి రాజాను అదుపులోకి తీసుకుని దానవాయిపేటలోని ఆయన నివాసానికి తీసుకెళ్లి హౌస్ అరెస్టు చేశారు.మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, కౌడా మాజీ చైర్మన్ రాజిరెడ్డి, కర్రి పాపారాయుడు తదితరులు రాజా నివాసానికి చేరుకుని మద్దతుగా నిలిచారు.అనంతరం రాజా విలేకరులతో మాట్లాడుతూ పేపరుమిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్మికులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు.
గత ఐదేళ్లూ ఏమయ్యారు : టీడీపీ
గడచిన ఐదేళ్లలో పేపరుమిల్లు కార్మికులకు వైసీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు న్యాయం చేయలేకపోయారని టీడీపీ నేతలు యిన్నమూరి దీపు, నక్కా దేవి వరప్రసాద్ ప్రశ్నించారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు పేపరుమిల్లు కార్మికుల కోసం దీక్షలు చేస్తామంటున్న వైసీపీ నాయకులు స్థానిక మా ర్గాని ఎస్టేట్ వద్ద చేస్తే బాగుంటుందన్నారు. ఎందుకంటే మిల్లు కార్మికులకు న్యాయం చేయకుండా పరంపర పేరుతో దోపిడీ చేసిన సొమ్ము భరత్ చేత కక్కించాలన్నారు. త్వరలో మిల్లు కార్మికులకు మంచి అగ్రి మెంట్ చేసేందుకు ఎమ్మెల్యే వాసు ,ఎంపీ పురందేశ్వరి, మంత్రి దుర్గేష్ కృషి చేస్తుంటే ఇప్పుడు రాజకీయం చేయాలనుకోవడం తగదన్నారు.సమావేశంలో నాయకులు ఆ డారి లక్ష్మినారాయణ, చింతపల్లి నాని, కందికొండ అనంత్, జయరామ్ పాల్గొన్నారు.