ప్రతీ హామీని అమలు చేస్తాం
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:56 AM
కూటమి ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నా రు. సోమవారం వేమగిరిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడా రు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
కడియం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): కూటమి ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నా రు. సోమవారం వేమగిరిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడా రు. గత ప్రభుత్వంలో ఒక బిడ్డకు మాత్రమే ‘అమ్మఒడి’ వేసిందని, మూ డేళ్లు వేసి రెండేళ్లు పంగనామం పె ట్టిందని ఆరోపించారు.తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది చదుకునే పిల్లలు ఉన్నా సరే ప్రతి ఒక్కరి కీ రూ.13 వేలు చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాకు కూటమి జమ చేసిందన్నారు. మిగిలిన రూ.2 వేలు పాఠశాల అభివృద్ధికి ఉప యోగిస్తుందన్నారు. మండలంలో ఒకరు-3199, ఇద్దరు-2843, ముగ్గురు-228, నలుగురు-13 వెరసి 9,621 మంది విద్యార్థుల సొమ్మును తల్లుల ఖాతాకు జమ చేసిన ట్టు వివరించారు. సన్నబియ్యం అందించిన ఘనత కూటమి ప్రభు త్వానిదేనన్నారు. తల్లికి వందనం పథకం అమ లుపై లబ్ధదారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, వి ద్యాశాఖ మంత్రి లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రా ష్ట్ర వైద్యవిభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరం ట్ల రవిరామ్‌కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, డా. వెలుగుబంటి వెంకటాచలం, చెల్లుబోయిన శ్రీను, మార్ని వాసుదేవరావు, బోడపాటి గోపి, వాసిరెడ్డి రాంబా బు, పంతం గణపతి, గట్టి సుబ్బారావు, దంగేటి సత్తిబాబు,సూరపురెడ్డి జానకీరామ్ పాల్గొన్నారు.