Share News

ప్రతిఒక్కరి ఇంటిపై జెండా ఎగరాలి

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:53 PM

స్వా తంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి చాటుకోవాలని ఆర్డీవో కృష్ణనాయక్‌ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ధవళేశ్వరంలో అధికారులు, కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన రహదారి గుండా సాగింది.

ప్రతిఒక్కరి ఇంటిపై జెండా ఎగరాలి
ధవళేశ్వరంలో అధికారులు, నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్డీవో కృష్ణనాయక్‌

  • ఆర్డీవో కృష్ణ నాయక్‌

  • ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా

  • జాతీయ జెండాలతో ర్యాలీలు

ధవళేశ్వరం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): స్వా తంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి చాటుకోవాలని ఆర్డీవో కృష్ణనాయక్‌ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ధవళేశ్వరంలో అధికారులు, కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన రహదారి గుండా సాగింది. ఆర్డీవో కృష్ణనాయక్‌, ఎంపీడీవో సునీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, తహశీల్దార్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి జి.వెంకట్రావు, కూటమి నాయకులు త్రివర్ణ పతాకాలు చేతబూని భారతమాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పా ల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మం డలాధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్‌, పి.అప్పారావు, యర్రమో తు ధర్మరాజు, ఆళ్ల ఆనందరావు, సావాడ శ్రీని వాసరెడ్డి, పుక్కెళ్ల రాజు, పల్లా రామస్వామి, అబ్దుల్‌ రెహ్మన్‌ఖాన్‌, యడ్ల మహేష్‌, కొప్పిశెట్టి గాంధీ, షేక్‌ అమీనా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:53 PM