ఒక్కో రైతుకు రూ.15 లక్షల రుణం
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:48 AM
కూట మి ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఒక్కో రైతుకు ఎకరానికి రూ.8 లక్షలు చొప్పున రూ.15 లక్షల వరకు రుణాలు మం జూరు చేస్తున్నామని చైర్మన్ గంగాధర్ పేర్కొన్నారు. మండలంలోని దోసకాయలపల్లి సొసైటీలో రైతు మహాజన సభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ సీఈవో కొయిడాల అప్పలరాజు సొసైటీ నివేదికను వివరించారు.
దోసకాయలపల్లి సొసైటీ మహాజన సభలో చైర్మన్ గంగాధర్
కోరుకొండ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఒక్కో రైతుకు ఎకరానికి రూ.8 లక్షలు చొప్పున రూ.15 లక్షల వరకు రుణాలు మం జూరు చేస్తున్నామని చైర్మన్ గంగాధర్ పేర్కొన్నారు. మండలంలోని దోసకాయలపల్లి సొసైటీలో రైతు మహాజన సభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ సీఈవో కొయిడాల అప్పలరాజు సొసైటీ నివేదికను వివరించారు. సొసైటీలో 562 మంది సభ్యులుగా ఉన్నారని వారి వాటా ధనం రూ.1,34,74,000 ఉందన్నారు. టర్నోవర్ రూ.13.83 కోట్లు అని అన్నారు. ఇటీవల 15మంది రైతులకు కొత్తగా రూ.83,3 3,000 రుణాలు అందజేశామన్నారు. 64 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశామన్నారు. 2023-24లో సక్రమంగా రుణాలు చెల్లించిన 191 మంది రైతులకు 3శాతం వడ్డీ రాయితో రూ.2,97,0 00 అందజేశామన్నారు. ప్రస్తుతం వరి రైతులకు యూరియా అందజేశామని, పండ్ల తోటలకు కూడా ఇవ్వాలని కోరుతున్నారని స్టాక్ వచ్చిన వెంటనే అందజేస్తామన్నారు.ఇదిలా ఉండగా ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినందుకు, యూరియాను సబ్సిడీపై సకాలంలో అందజేసినందుకు రైతులు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ,రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణలతో ఉన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో టీడీపీ నాయకుడు మార్ని రాము, సొసైటీ డైరెక్టర్లు కర్రి రాజారావు, గల్లా శ్రీనివాసరావు, స్టాప్ అసిస్టెంట్ కాకర సత్యనారాయణ మూర్తి, రైతులు మార్ని మధుసూదనరావు, అగ్రపు ఆదినారాయణ, సూదిన సుబ్బారావు, సర్పంచ్ తారా రాంబాబు, పచ్చిపాల సూర్యారావు, రాము, మల్లిన వీరభాస్కర చౌదరి పాల్గొన్నారు.