Share News

ఈఎస్‌ఐ ఆసుపత్రి అదిరే!

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:32 AM

కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ఆధునిక వైద్య సదుపాయాలతో రాజమహేంద్రవరంలో కార్మిక ప్రభుత్వ బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ ఆస్పత్రి) ఆసుపత్రి సిద్ధమైంది.

ఈఎస్‌ఐ ఆసుపత్రి అదిరే!
రాజమహేంద్రవరంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి

రూ.56 కోట్లతో రాజమహేంద్రవరంలో నిర్మాణం

మరో వారంలో ఆరంభించడానికి సన్నాహాలు

సూపర్‌ స్పెషాలిటీ సేవలు లేకపోవడంపై విస్మయం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ఆధునిక వైద్య సదుపాయాలతో రాజమహేంద్రవరంలో కార్మిక ప్రభుత్వ బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ ఆస్పత్రి) ఆసుపత్రి సిద్ధమైంది. మరో వారంలో అందుబాటులోకి రానుంది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ మురళీమోహన్‌ చొరవతో పునాది రాయి పడిం ది. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో పనులు నత్తన డకన సాగాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తుది మెరుగులు అద్దుకుని వైద్య సేవలకు సన్నద్ధమైంది. వైద్య పరికరాలు/యంత్రాలు/ వస్తువులు ఇంకా రావాల్సి ఉంది. ఐదేళ్ల కల సాకారం కావడం, పేద కార్మి కులకు అధునాతన వైద్య సదుపాయం అం దుబాటులోకి రానుం డడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

రూ.56 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం

ఆస్పత్రి నిర్మాణానికి రూ.97.98 కోట్లను 2020 ఆగస్టు 19న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిం ది. 5.83 ఎకరాల విస్తీర్ణంలో రూ.56 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. వాస్తవానికి 2022 జూలై 10వ తేదీకి నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా 2024 డిసెంబరు 30కి పూర్తయింది. ఆరు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ బదిలీ చేసింది. 1987లో 50 పడకల ఆస్పత్రిగా సేవలు ప్రారంభించగా ఇప్పుడు 100 పడకల ఆస్పత్రిని నిర్మించారు. అయితే ఆ స్థాయికి అప్‌ గ్రేడ్‌ కావాల్సి ఉంది. అప్పుడే ఆ స్థాయికి తగి నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇప్పటికే ఆస్పత్రికి అవసరమయ్యే యంత్రాలు,పరిక రాలు, మానవ వనరులు, నిర్వహణ వంటి వాటి పై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సూపర్‌ స్పె షాలిటీ వైద్య సేవలు ఏర్పాటు చేయకపోవ డంతో బయటి ఆస్ప త్రుల కు రిఫర్‌ చేయ డం తప్పకపోవచ్చు. భారీ వ్యయంతో నిర్మిం చిన ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ సేవలు లేకపోవ డంపై విస్మయం వ్యక్తమవుతోంది.ఎంపీ పురం దేశ్వరి కల్పిం చుకుని పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది, యంత్ర పరికరాలు త్వరితగతిన అం దుబా టులోకి తేవాలని కార్మికులు కోరుతున్నారు.

ఔరా అనిపించేలా..

ఆసుపత్రిని ఔరా అనిపించేలా నిర్మించారు. మహిళా శిశు వైద్య విభాగానికి ఏకంగా ఒక ఫ్లోర్‌నే కేటాయించారు.ఈ విభాగం అద్భుతమనే చెప్పాలి. సెకండరీ కేర్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనిక్‌, ఆర్థో, ట్రామా కేర్‌తో సహా 26 రకాల వైద్య సేవలను అందించనున్నారు. సెంట్రల్‌ ఏసీ సదుపాయంతో పాటు భద్రతకు 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రీనరీ, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, లాండ్రీ, క్లాత్‌ వాషింగ్‌ ఇలా అన్ని సదుపాయాలు ఆధునికం గానే ఉన్నాయి. ప్రతి వార్డులోని ప్రతి మంచం వద్ద ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యం ఉంది. రోగులు వేచి ఉండే ప్రదేశం, ఆపరేషన్‌ థియే టర్లు విశాలంగా నిర్మించారు.స్ట్రెచర్‌ పట్టే విధం గా నాలుగు లిఫ్టులు ఉన్నాయి. అంధులు ఇబ్బంది పడకుండా మెట్లు, లిఫ్టుల వద్ద బ్రెయి లీ లిపితో బోర్డులు ఏర్పాటు చేశారు.

ఏ ఫ్లోర్‌లో ఏముంటాయి..

గ్రౌండ్‌ ఫ్లోరులో 32 గదుల్లో ఓపీ, వ్యాధి నిర్ధారణ, ఈసీజీ,ఎక్స్‌రే, క్యాజువాలిటీ, క్యాజు వాలిటీ ఆప రేషన్‌ థియేటర్‌, ఫార్మసీ, క్యాంటీన్‌, లాండ్రి, ఆయుర్వేద,హోమియో, ఎమర్జెన్సీ వార్డు,ఫిజి యోథెరపీ తదితర సేవలు ఉంటాయి.రెండో ఫ్లోరును పూర్తిగా మాతా శిశువుల కోసం కేటా యించారు.వారికి సంబంధించిన అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐసీయూ, పీఐసీయూ, హెచ్‌డీయూ, ఎన్‌ఐసీ యూ, ఎస్‌ఐ సీయూ, ఆపరేషన్‌ థియేటర్లు, ప్రొసీజర్‌ రూమ్స్‌, లాకర్లు ఇలా 26 రూములు నిర్మించారు. మూడో ఫ్లోరులో 12 పడకల చొప్పున 6 వార్డులు ఉం డగా.. పురుషులకు, మహిళలకు విడివిడిగా విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు.వార్డుల్లో సైతం ఆక్సిజన్‌, వెంటిలే టర్‌, వంటి సదుపాయాన్ని కల్పించారు. ఇదే ఫ్లోరులో లైబ్రరీ, బ్లడ్‌ స్టోరేజీ, ఎంఆర్‌డీ, పరిపాలన గదులు ఉంటాయి. వైద్యు లు, సిబ్బంది క్వార్టర్స్‌ ఆస్పత్రి ప్రాంగణంలోనే నిర్మించారు. టైప్‌ 2, 3, 4, టైప్‌ 4 స్పెషల్‌ విభాగాలుగా మొత్తం 32 ప్లాట్లు ఉన్నాయి.

సిబ్బంది కావలెను..

ప్రస్తుతం 50 బెడ్స్‌ స్థాయిలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సింగ్‌, పరిపాలన కలిపి కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు. కొత్త ఆస్పత్రిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే కనీసం 300-350 మంది సిబ్బంది అవసరం అవుతుంది. మూడు కుపైగా ఐసీయూలు, ఆపరేషన్‌ థియే టర్లు, అత్యవసర వైద్య విభాగాలు ఉండడంతో షిఫ్టుల వారీగా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల 100 మంది వరకూ డాక్టర్లు ఉండాలి. ఆస్పత్రిలో హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది 200 మంది వరకూ అవసరం అవు తుంది. వీరిని ప్రభుత్వం నియమించే వరకూ ఉన్నవాళ్లతో నెట్టుకురాక తప్పని పరిస్థితి ఉంది. కాకినాడ ఈఎస్‌ఐ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. రాజమహేంద్రవరం ఆస్పత్రి నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు.

12 డిస్పెన్పరీలకు పెద్దాసుపత్రి..

ఆస్పత్రి పరిధిలో రాజమహేంద్రవరం, సీతం పేట, లాలా చెరువు, ఇన్నీసుపేట, కడియం, ధవళేశ్వరం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లి గూడెం, తణుకు, భీమవరం, వేండ్ర డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల నుంచి కార్మికులను ఈ ఆసుపత్రికి రిఫర్‌ చేస్తారు.

Updated Date - Jul 23 , 2025 | 01:32 AM