Share News

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మందుల్లేవ్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:21 AM

కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా రాజమహేం ద్రవరంలో కార్మిక ప్రభుత్వ బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ ఆస్పత్రి) నూతన భవనం అందుబా టులోకి వచ్చిందని ఆ భవనాన్ని చూసి సంబర పడడం తప్ప ఆస్పత్రికి పట్టిన రుగ్మతలకు చికి త్స జరగడం లేదు

 ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మందుల్లేవ్‌

కాలదోషానికి దగ్గరైనవే పంపిణీ

బయట కొనుక్కోలేక రోగుల తిప్పలు

ఆరు నెలల నుంచీ ఇదే పరిస్థితి

భవనం కొత్తది.. సదుపాయాలు పాతవే

3 ఫ్లోర్లలో ఒకటే వాడకం.. 2 ఖాళీ

నిర్వహణ బాగోకపోతే రూ.56 కోట్లు వృథా

గాడిలో పెట్టే కృషి చేయని ప్రజాప్రతినిధులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా రాజమహేం ద్రవరంలో కార్మిక ప్రభుత్వ బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ ఆస్పత్రి) నూతన భవనం అందుబా టులోకి వచ్చిందని ఆ భవనాన్ని చూసి సంబర పడడం తప్ప ఆస్పత్రికి పట్టిన రుగ్మతలకు చికి త్స జరగడం లేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ మురళీ మో హన్‌ చొరవతో పునాది రాయి పడింది. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో పనులు నత్తనడకన సాగా యి. మూడేళ్ల ఆపసోపాల తర్వాత ఈ జూలైలో గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభమైనా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. ఈఎస్‌ఐ ఆస్పత్రికి రోజూ 120 వరకూ ఓపీ ఉంటుంది. ఈఎస్‌ఐలో కార్మికులు, వారి కుటుంబాలకు వైద్యం అందించాల్సి ఉంటుంది. ఈ కార్మికులు అందరూ రూ.20వేలలోపు వేత నం కలిగిన వాళ్లే ఉంటారు. దీంతో మందులు లేకపోవడంతో బయట కొనుక్కోవాల్సి వస్తోంది. డాక్టర్లు రాసిన మందుల్లో చాలా మటుకు అం దుబాటులో ఉండకపోవడం వారికి తలపోటుగా మారింది. మందులు దాదాపుగా నిండుకొని ఆరు నెలలవుతోంది. ఇప్పుడు రూ.4కోట్ల విలువై న 200పైగా మందుల జాబితాతో ఇండెంట్‌ రెడీ చేశారు. వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత వస్తే అదృష్టమనే చెప్పాలి. ఈ పరిస్థి తుల్లో ఇప్పుడు ఫార్మసీలో ఉన్న కొద్దిపాటి మం దులనే పంపిణీ చేస్తున్నారు. వాటిలో చాలా వరకూ ఒకటి, రెండు నెలల్లో కాలదోషం పట్టేవే ఉంటున్నాయి. కనీసం కాల్షియం బిళ్లలు కూడా లేవంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఫ రూ.56 కోట్లు వృథానా!

ఆస్పత్రి నిర్మాణానికి రూ.97.98 కోట్లను 2020 ఆగస్టు 19న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిం ది. అయితే 5.83 ఎకరాల విస్తీర్ణంలో రూ.56కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఆస్పత్రి జీ+2 ఫ్లోర్లతో 13376 చదరపు మీటర్లలో ఉండ గా, మార్చురీ భవనం 77.40 చదరపు మీటర్లలో నిర్మించారు. వాస్తవానికి 2022 జూలై 10కి నిర్మా ణం పూర్తి కావాల్సి ఉన్నా 2024 డిసెంబరు 30కి పూర్తయింది. ఆరు నెలల తర్వాత రాష్ట్ర ప్రభు త్వానికి ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ బదిలీ చేసింది. క్యాజువాలిటీ ఆపరేషన్‌ థియేటర్‌, అగ్నిమాపక తలుపులు, ఐసీయూలు, యోగా గదితోసహా అన్ని గదులనూ ఔరా అనిపించే విధంగా నిర్మిం చారు. మహిళా శిశు వైద్య విభాగానికి ఏకంగా ఒక ఫ్లోర్‌నే కేటాయించారు. అన్ని రకాల వైద్య సదుపాయాలకు ఏర్పాట్లు కల్పించారు. సెకండరీ కేర్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనిక్‌, ఆర్థో, ట్రామా కేర్‌తోసహా 26 రకాల వైద్య సేవ లను అందించే విధంగా నిర్మాణాలు ఉన్నాయి. సెంట్రల్‌ ఏసీ సదుపాయంతోపాటు భద్రతకు 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులోని ప్రతి మంచం వద్ద ఆక్సిజన్‌, వెంటిలే టర్‌ సౌకర్యం ఉంది. కాకపోతే మంచాలే ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. ఆపరేషన్‌ థియేట ర్లు అత్యంత విశాలంగా ఉండి యంత్రాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ఆస్పత్రి పరిధిలో రాజమండ్రి, సీతంపేట, లాలాచెరువు, ఇన్నీసుపే ట, కడియం, ధవళేశ్వరం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం,తణుకు, భీమవరం, వేండ్ర డిస్పెన్సరీలు ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోరులో 32 గదు ల్లో ఓపీ, వ్యాధి నిర్ధారణ, ఈసీజీ, ఎక్స్‌రే, క్యాజు వాలిటీ, క్యాజువాలిటీ ఆపరేషన్‌ థియేటర్‌, ఫార్మ సీ, క్యాంటీన్‌, లాండ్రి, ఆయుర్వేద, హోమియో, ఎమర్జెన్సీ వార్డు, ఫిజియోథెరపీ తదితర సేవలు ఉంటాయి. రెండో ఫ్లోరును పూర్తిగా మాతా శిశు వుల కోసం కేటాయించారు. వారికి సంబంధిం చిన అన్ని వైద్య సదుపాయాలనూ ఏర్పాటు చేస్తున్నారు. ఐసీయూ, పీఐసీయూ, హెచ్‌డీ యూ, ఎన్‌ఐసీయూ, ఎస్‌ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు, ప్రొసీజర్‌ రూమ్స్‌, లాకర్లు ఇలా 26 రూములు నిర్మించారు. మూడో ఫ్లోరులో 12 పడకల చొప్పున 6 వార్డులుండగా.. పురుషులకు, మహిళలకు విడివిడిగా విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. వార్డుల్లో సైతం ఆక్సిజన్‌, వెంటి లేటర్‌, వంటి సదుపాయాన్ని కల్పించారు. ఇదే ఫ్లోరులో లైబ్రరీ, బ్లడ్‌ స్టోరేజీ, ఎంఆర్‌డీ, పరిపాలన గదులు ఉన్నాయి. ఆస్పత్రి భవనంలో ప్రస్తుతం ఒక్క ఫ్లోరు మాత్రమే వినియోగంలోకి వచ్చింది. రెండో ఫ్లోరులో సూపరింటెండెంట్‌ గదిని మాత్రమే వాడుతుండగా మిగతా ఫ్లోర్లు, గదులు.. రోగులు, సిబ్బంది, వైద్య పరికరాల కోసం ఎదురు చూస్తున్నాయి. వైద్యులు, సిబ్బం దికి నివాసాలను కూడా ఆస్పత్రి ప్రాంగణంలోనే నిర్మించారు. నిర్వహణ గాడిలో పడకపోతే కోట్లు వృథా అయినట్టేనని భావించాల్సి వస్తుంది.

ఫ స్టాఫ్‌ని నియమిస్తేనే..

ఈ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సింగ్‌, పరిపాలన కలిపి 30 మంది ఉన్నారు. కానీ 100 మందికిపైగా ఉండాలి. స్వచ్ఛ భారత్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తుండగా.. ఈ ఆస్పత్రిని హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌ సరిపడా లేకుండానే పరిశుభ్రతను నెట్టు కొస్తున్నారు. కొత్త భవనంలోకి ఆస్పత్రి కార్యకలాపాలు మారిన తర్వాత 12 మంది పారిశుధ్య సిబ్బందిని, ఆరుగురు సెక్యూరిటీని మాత్రమే ఇచ్చారు. మూడుకుపైగా ఐసీయూలు, ఆపరేషన్‌ థియేటర్లు, అత్యవసర వైద్య విభా గాలు ఉండడంతో షిఫ్టుల వారీగా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల 100 మంది వరకూ డాక్టర్లు ఉండాలి. హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది 200 మంది వరకూ అవసరం అవుతుంది. కానీ సూపర్‌ స్పెషాలిటీ సేవలు లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

Updated Date - Nov 25 , 2025 | 01:21 AM