Share News

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. సామర్లకోటకు ప్రయాణికులు..

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:00 AM

సామర్లకోట, డిసెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే 18189 నంబరు గల పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని బీ1, ఎం2 ఏసీ బోగీలకు ఎలమంచిలి స్టేషన్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఏర్పడిన అగ్నిప్రమాదంలో ప్రయాణి కులు తప్పించుకున్నారు. మంటల్లో ఇరుక్కున్న 158 మంది ప్రాణాలు అ

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. సామర్లకోటకు ప్రయాణికులు..
సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను రైలు ఎక్కిస్తున్న అధికారులు

బస్సుల్లో తరలింపు

అల్పాహారం, వాటర్‌బాటిళ్ల అందజేత

సామర్లకోట, డిసెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే 18189 నంబరు గల పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని బీ1, ఎం2 ఏసీ బోగీలకు ఎలమంచిలి స్టేషన్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఏర్పడిన అగ్నిప్రమాదంలో ప్రయాణి కులు తప్పించుకున్నారు. మంటల్లో ఇరుక్కున్న 158 మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని కిందికి దిగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అయితే వారిని రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలమంచిలి నుంచి 3 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. మరోపక్క అగ్ని ప్రమా దంలో మంటల్లో చిక్కుకున్న 3 బోగీలను కట్‌ చేసి వాటిని ఎలమంచిలి స్టేషన్‌లోనే సైడ్‌లైనుకు చేర్చి మిగిలిన బోగీలతో రైలును సామర్లకోటకు సోమవారం ఉదయం 9 గంటలకు తీసుకొచ్చారు. అప్పటికే సామర్లకోట రైల్వే స్టేషన్‌కు బస్సుల్లో తరలించిన ప్రయాణికులందరికీ స్టేషన్‌ ఆవర ణలో ప్రత్యేక సపర్యలు చేయడమేగాక అల్పాహా రం, వాటర్‌ బాటిళ్లను రైల్వే ఎస్‌ఎం.రమేష్‌ ఆధ్వ ర్యంలో రైల్వే అధికారులు అందజేశారు. రాజ మహేంద్రవరం రైల్వేస్టేషన్‌ నుంచి 3 ఏసీ బోగీల ను హుటాహుటిన సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌కు అనుసం ధానం చేశారు. సుమారు 25 మంది టిక్కెట్‌ కలె క్టర్ల సాయంతో ప్రయాణికులను సామర్లకోటలో ఏర్పాటు చేసిన 3 బోగీల్లో ఎక్కించారు. సామర్ల కోట నుంచి రైలు 10.45 గం.కు బయలుదేరింది.

ఆందోళనలో ప్రయాణికులు

అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్నది మొదలు సామర్లకోట స్టేషన్‌లో రైలు తిరిగి బయలు దేరేవరకూ సుమారు 8 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఆందో ళనకు గురయ్యారు. 158 మంది ప్రయాణికులకు సామర్లకోట లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అమల కంటి శ్రీనివాసరావు సౌజన్యంతో 3 రకాల అల్పాహారం, 250 వాటర్‌బాటిళ్లను అందజేశారు. శ్రీనివాస రావుకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

రైలు ప్రమాదం కారణంగా అటు విశాఖ, ఇటు విజయవాడ నుంచి సామర్లకోటకు చేరాల్సిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంట నుంచి సుమారు 3 గం టల పాటు ఆలస్యంగా చేరుకున్నాయి. పూరీ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్‌, హౌరా నుంచి హైద్రాబాద్‌ వెళ్లాల్సిన ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ నుంచి లింగంపల్లి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్‌లు సుమారు రెండు న్నరగంటల పాటు ఆలస్యంగా ప్రయాణించాయి. ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు రైళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజెప్పేందుకు సామర్లకోట స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌ సదుపాయాన్ని ఏర్పాటుచేశారు.

రంగంలోకి ఉన్నతాధికారులు..

అగ్ని ప్రమాద సంఘటనపై విచారణ జరిపేందుకు రైల్వే ఉన్నతాధికారుల దర్యాప్తు రంగంలోకి దిగింది. సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి పలువురు ఉన్నతాధికారులు ఎలమంచిలికి చేరుకున్నారు. మంటలు ఎలా సంభవించాయి అనే కోణంలో సమాచారం రాబట్టారు. పూర్తిగా కాలిపోయిన బోగీల సాంకేతిక సామర్థ్యాన్ని పరిశీలించి రాజ మహేంద్రవరం రైల్వే యార్డుకు చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 01:00 AM