Share News

ఎందుకింత నిర్లక్ష్యం

ABN , Publish Date - Oct 26 , 2025 | 01:15 AM

అన్నవరం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కార్తీకమాసం సందర్భంగా భక్తులకు కల్పించిన ఏర్పాట్లపై దేవదాయ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ శనివారం స్వీయ పర్యవేక్షణ చేశారు. భక్తు లు స్వామి సన్నిధికి విచ్చేసే స్వాగత ద్వారం వ ద్ద

ఎందుకింత నిర్లక్ష్యం
నూతన మెట్లమార్గాన్ని పరిశీలిస్తున్న దేవదాయ కమిషనర్‌ రామచంద్రమోహన్‌

అన్నవరం దేవస్థానంలో కార్తీకమాస ఏర్పాట్లపై దేవదాయ కమిషనర్‌ అసహనం

సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి

కూడళ్ల వద్ద భక్తులకు సూచీబోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశం

అన్నవరం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కార్తీకమాసం సందర్భంగా భక్తులకు కల్పించిన ఏర్పాట్లపై దేవదాయ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ శనివారం స్వీయ పర్యవేక్షణ చేశారు. భక్తు లు స్వామి సన్నిధికి విచ్చేసే స్వాగత ద్వారం వ ద్దనే నిర్వహణ ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ముందుగా కళాశాల మైదానాన్ని పరిశీలించారు. కళాశాల ఆనుకుని ఉన్న క్రీడాస్థలం కోసం ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ను తొలగించడంతో పాటుగా అక్కడక్కడా ఉన్న గోతులను పూడ్చాలన్నారు. టోల్‌ గేట్‌ వద్ద శానిటేషన్‌ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నూతన మెట్లమార్గాన్ని పరిశీలించారు. ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడానికి కారణమేంటని ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ రామకృష్ణను ప్ర శ్నించారు. మరో వారంరోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రక్షణగోడను రాతితో నిర్మించాలని, మెట్లమార్గంలో కేబుల్‌ విద్యుత్‌ కాకుండా సోలార్‌కు ప్రాధాన్యమివ్వాలని తెలి పారు. సీఆర్వో కార్యాలయం పరిశీలించి గదుల ఖాళీల వివరాలు డిస్‌ప్లేలో ఉండేలా చూడాలని, దీనిని రోజు జిపిఎస్‌ ఫోటో తీసి ఈవో ఫోన్‌ కు పంపించాలన్నారు. భక్తులకు ఎక్కడా సూచీబోర్డులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో అసం తృప్తి వ్యక్తం చేశారు. తాను స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు.

శానిటేషన్‌ నిర్వహణపై ఆగ్రహం..

అనంతరం ఆయన వినాయక అతిథిగృహం లో ఈవో, చైర్మన్‌, ఏఈవోతో సమావేశమయ్యా రు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేవిధంగా చూడాలని వసతిగదులు, అందులో మౌలికవసతులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం వి ష్ణుసదన్‌ హాల్స్‌ పరిశీలించి శానిటేషన్‌ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల విశ్రాంతి తీసుకునే హాల్స్‌లో వివాహ డెకరేషన్‌ మండపా లు ఉండడంతో వివాహం అనంతరం తొలగించే లా చూడాలన్నారు. భక్తుల కోసం నిర్మించిన వి శ్రాంతి షెడ్డులో వ్రతం టిక్కెట్టు, ప్రసాదం కౌంట ర్లు ఏర్పాటుచేసిన ప్రదేశం సరిగా లేదని దానిని చివరకు మార్చాలని రద్దీసమయంలో హోల్డింగ్‌పాయింట్ల వద్ద నిండిన జనం ఈ విశ్రాంత షె డ్డుకు వచ్చేలా చూడాలని సూచించారు. అనం తరం కమాండ్‌ కంట్రోల్‌రూం వద్ద సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉద్యోగి తనకు అప్ప గించిన బాధ్యతలతో పాటుగా మిగిలిన వాటిలోకూడా భాగస్వామ్యం కావాలన్నారు. శని,ఆది,సోమవారాలతో పాటుగా ఏకాదశి, దశమి, కార్తీకపౌర్ణమి రోజుల్లో ఈవో పశ్చిమరాజగోపురం వద్దనే ఉండి పర్యవేక్షణ చేయాలని కమిషనర్‌ ఆదేశిం చారు. తప్పనిసరిగా రోప్‌ ఉండాలని దీనిద్వారా తోపులాటలు నివారించవచ్చన్నారు. వాకీటాకీల ద్వారా ఎప్పటికప్పుడు మోనటరింగ్‌ చేసుకోవాలన్నారు. ప్రధానంగా కార్తీకపౌర్ణమి రోజు చాలా కీలకమైనదని.. ఒకపక్క స్వామి సన్నిధికి వ్రతం,దర్శనం కోసం వచ్చేవారు, మరోపక్క గిరిప్రదక్షిణకు వచ్చేవారి సంఖ్య సుమారు 2లక్షలమంది ఉంటుందని దానికణుగుణంగా వ్యవహరించాలన్నారు. గిరిప్రదక్షణ సమయంలో సత్యరథం తొలిపావంచా వద్ద ఎక్కువసేపు నిలపకుండా 15 నిమిషాల్లో కదపాలన్నారు. గిరిప్రదక్షిణ రోడ్డులో చిన్నచిన్న రాళ్లు ఉంటున్నాయని, అక్కడ రోలింగ్‌ చేయాలని అదేవిధంగా సుమారు 50 అదనపు టాయిలెట్లు ఉండేలా చూడాలన్నారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌, అధికారులున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 01:15 AM