ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:48 AM
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కొంత మంది సిబ్బంది ప్రవర్తిస్తున్నారని, అటువంటి వారిని సహించబోమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాల యం వద్ద నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఆడిట్ వివరాలను అదికారులు గ్రామాల వారీగా వివరించారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తిలో సామాజిక తనిఖీ వేదిక
రూ.2.23 లక్షల నిధుల దుర్వినియోగం
అనపర్తి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కొంత మంది సిబ్బంది ప్రవర్తిస్తున్నారని, అటువంటి వారిని సహించబోమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాల యం వద్ద నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఆడిట్ వివరాలను అదికారులు గ్రామాల వారీగా వివరించారు. మండల పరిధిలో రూ.2.23 లక్షల నిధులు దుర్వినియోగమైనట్టు అధికారులు గుర్తించారు. అత్యధికం పెడపర్తి పూర్వ ఫీల్డ్ అసిస్టెంట్ బోడా ప్రతాప్ రూ.1.28 లక్షలు, మహేంద్రవాడ పూర్వ ఫీల్డ్ అసిస్టెంట్ సత్తి సృజన రూ.51,860 దుర్వినియోగం చేసినట్టు పేర్కొన్నారు. వీరి నుంచి సొమ్ముల రికవరీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి పనుల్లో మత్తర్ల మాయా జాలం జరుగుతున్నా సూపర్‌వైజర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో డ్వామా డీవీవో రత్నకుమారి, ఏపీడీ వరప్రసాద్, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.