అర్హులందరికీ పింఛన్లు
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:19 AM
గ్రామీణస్థాయిలో అర్హులందరికీ పింఛన్లు అందే విధంగా కృషి చేస్తున్నామని రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. దివాన్‌చెరువులో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో సచివాలయ సిబ్బందితో కలసి ఆయన పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రుడా చైర్మన్ బీవీఆర్ చౌదరి
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
దివాన్‌చెరువు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): గ్రామీణస్థాయిలో అర్హులందరికీ పింఛన్లు అందే విధంగా కృషి చేస్తున్నామని రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. దివాన్‌చెరువులో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో సచివాలయ సిబ్బందితో కలసి ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమ ని చెప్పారు. ప్రతీ లబ్ధిదారునికి పారదర్శకంగా పింఛన్లు అందేలా ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వృద్ధాప్య, వితంతువులు, నేతకార్మికులు, ప్రత్యేక ప్రతిభావంతులు పింఛన్లు పెంపు చేసి అందజేస్తోందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యాదవ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల నాగేశ్వరరావు, నాయకులు కందులబాబూరాయుడు, వంక మల్లిబాబు, ఖండవిల్లి లక్ష్మి, మల్లారపుసత్యానందం, పంచికట్ల నాగు, దాసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.