‘ఏలేరు’లో పెరుగుతోన్న నీటి నిల్వలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:11 AM
ఏలేశ్వరం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేరులో జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మెస్తారు వర్షాలు, గోదావరి జలాలు విడుదల చేస్తుండడంతో రిజర్వాయర్‌లోని నీరు పెరుగుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకు పెరుగున్నాయి. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథ
ఏలేశ్వరం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేరులో జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మెస్తారు వర్షాలు, గోదావరి జలాలు విడుదల చేస్తుండడంతో రిజర్వాయర్‌లోని నీరు పెరుగుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకు పెరుగున్నాయి. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు 525 క్యూసెక్కులు ఏలేరు జలాశయానికి విడుదలవుతున్నాయి. గతంలో ఎన్న డూ లేనిరీతిలో ప్రాజెక్టులో 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. 79.25 మీటర్ల స్థాయిలో 12.59 టిఎంసీలు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎడమ కాలువ నుంచి విశాఖపట్నంకి 200 క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తున్నారు.