Share News

కేజ్‌ కల్చర్‌కు ఏలేరు ప్రాజెక్టు

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:52 PM

ఏలేశ్వరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేజ్‌ కల్చర్‌ (చేప పిల్లలను బాక్సుల్లో పెంచడం) కు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలే రు జలాశయాన్ని విశాఖపట్నంలోని మిస్సర్స్‌ ఫిషన్‌ ఇం డియా ప్రయివేటు లిమిటెడ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మద్దువలస రి

కేజ్‌ కల్చర్‌కు ఏలేరు ప్రాజెక్టు

ప్రభుత్వం ఉత్తర్వులు

ఏలేశ్వరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేజ్‌ కల్చర్‌ (చేప పిల్లలను బాక్సుల్లో పెంచడం) కు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలే రు జలాశయాన్ని విశాఖపట్నంలోని మిస్సర్స్‌ ఫిషన్‌ ఇం డియా ప్రయివేటు లిమిటెడ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మద్దువలస రిజర్వాయర్‌తో పాటు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఏలేరు ప్రాజెక్టులలో పై కంపెనీ చేపల పెంప కాన్ని చేసుకునేందుకు కంపెనీకి అనుమతి లభించింది. ప్రారంభంలో ఆర్థికంగా పెట్టుబడి పెట్టేందుకు ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ అంగీకారం తెలిపినట్టు ఉత్త ర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. దశలవారీగా చేపల పెంపకంపై మత్స్యకారులకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు లిమిటెడ్‌ కంపెనీ ముందుకు వచ్చింది. సదరు కంపెనీకి మందస్తు అనుభవం ఉండడంతో ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.

Updated Date - Sep 12 , 2025 | 11:52 PM