రాయవరం బాణసంచా ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:38 AM
రాయవరం, అక్టోబరు 10(ఆంధ్ర జ్యోతి): ఏలూరు రేంజ్ పరిధిలో అన్ని జిల్లాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు, హోల్‌సేల్ స్టాక్ పాయిం ట్లు తాత్కాలిక లైసెన్స్ పొందిన షాపులపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రా
ఏలూరు రేంజ్ పరిధిలో బాణసంచా తయారీ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు : డీఐజీ
రాయవరం, అక్టోబరు 10(ఆంధ్ర జ్యోతి): ఏలూరు రేంజ్ పరిధిలో అన్ని జిల్లాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు, హోల్‌సేల్ స్టాక్ పాయిం ట్లు తాత్కాలిక లైసెన్స్ పొందిన షాపులపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం రాత్రి తనిఖీ చేసిన సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఈనెల 8న రాయవరం శ్రీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన బాణసంచా విస్ఫోటనం ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్ టీం క్లూస్ వివరాలు సేకరించిందని, ప్రమాదంపై రిపోర్టు రావాల్సి ఉందన్నారు. తాను ఇప్పటికే అమలాపురం, మండపేట తదితర ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేశానన్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్‌సేఫ్టీ పరికరాలను వినియోగించేందుకు ఆపరేటర్ చేసే వ్యక్తి లేనట్టు గుర్తించినట్టు చెప్పారు. ప్రతి బాణసంచా తయారీ కేంద్రం వద్ద ఫైర్‌సేఫ్టీ మోకానిజం ఉపయోగించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించేలా ఆయా దుకాణదారులను అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీకి సూచించారు. బాణసంచా కొనుగోలు చేసి వచ్చే సంవత్సరం ఉపయోగించుకోవచ్చనే ఆలోచనతతో కొంతమం ది ఇంట్లో బాణసంచా నిల్వ ఉంచినా ప్రమాదా లు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలు ఇంట్లో గాని, అనుమతులు లేకుండా గాని బాణసంచా నిల్వలు ఉంచరాదన్నారు. ఆయన వెంట ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్, మండపేట రూరల్ సీఐ దొరరాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐ పుల్లారావు, ఎస్‌ఐ డి.సురేష్ బాబు ఉన్నారు.