విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం... కుటుంబానికి శాపం!
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:29 AM
ఆత్రేయపురం, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద 17 విద్యుత్ కనెక్షన్లు ఉన్న ట్టుగా ఆన్‌లైన్‌లో చూపించడంతో ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆ కుటుంబ సభ్యులు అర్హత కోల్పో గా విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా ఆ
మృతుడి పేరుతో 17 విద్యుత్ కనెక్షన్లు
రేషన్‌కార్డు దరఖాస్తులో బట్టబయలు
అందని ప్రభుత్వ పథకాలు
ఆత్రేయపురం, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద 17 విద్యుత్ కనెక్షన్లు ఉన్న ట్టుగా ఆన్‌లైన్‌లో చూపించడంతో ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆ కుటుంబ సభ్యులు అర్హత కోల్పో గా విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన పల్లెకొండ అజ్జయ్య అనే దళిత వృద్ధుడు ఇటీవల మరణించాడు. అతడి కుమారుడు భీమరాజు ఓ ప్రవేట్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. అర్జయ్య భార్యతో పాటు కుమారుడు భీమరాజు, భార్య ఒకే రేషన్‌కార్డులో ఉన్నారు. భీమరాజుకు రెండేళ్ల బాలుడు లిశాంత్‌రాజ్ ఉన్నాడు. పుట్టుకతోనే బాలుడికి మెదడు పనిచేయకపోవడంతో మంచానికి పరిమితమయ్యాడు. లిశాంత్ కు నూరుశాతం పర్సంటేజీతో సదరం సర్టిఫికెట్ వైద్యులు మంజూరు చేశారు. కుమారుడి పేరు రేషన్‌కార్డులో నమోదు చేసేందుకు తండ్రి భీమరాజు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసేందుకు వెళ్లగా మీ తండ్రి అర్జయ్య పేరు మీద 17 విద్యుత్ సర్వీసులు ఆన్‌లైన్‌లో ఉన్నట్టు చెప్పడం తో నిర్ఘాంతపోయాడు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు.
ఎక్కడ జరిగింది తప్పు...
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ దళిత కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయి. బాలుడికి దివ్యాంగ పింఛన్ వస్తే వైద్యానికి ఉపయోగపడుతుందని ఆ కుటుంబం భావిస్తుంది. 2018లో విద్యుత్ మీటర్లకు ఆధార్‌లింక్ అనుసంధానం చేశారు. విద్యుత్ మీటర్లు ఉన్న వ్యక్తుల ఆధార్‌కార్డు ఇంటిపన్ను రశీదులు సేకరించారు. ఏపీ ట్రాన్స్‌కో డివిజన్ కార్యాలయానికి సిబ్బంది పంపించారు. నియోజకవర్గంలోని 4 మండలాల విద్యుత్ మీటర్లకు ఆధార్‌నెంబరుతో అ నుసంధానం చేశారు. ఆధార్ లింక్ చేసే సమయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు బలంగా ఏర్పడ్డాయి. కొంతమంది సిబ్బంది బినామి పేర్లతో ఆఽధార్‌లింక్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో అర్హత ఉండి ప్ర భుత్వ పథకాలు అందక లబోదిబోమంటున్నారు.