ఎన్నికల హామీని నిలబెట్టుకుంటాం
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:08 AM
ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను తాము నిలబెట్టుకుంటామని ఎమ్మె ల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జాంపేట కురేషి మసీదులో శనివారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ముస్లింలతో విందు స్వీకరించారు.

కురేషి మసీదు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్ర జ్యోతి): ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను తాము నిలబెట్టుకుంటామని ఎమ్మె ల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జాంపేట కురేషి మసీదులో శనివారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ముస్లింలతో విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఆెరోడ్డులోని ఎస్టీపి ప్లాంట్ సమీపంలోని కమేళా నిర్మాణం, అభివృద్ధి కోసం తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.10 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చా మని, త్వరలోనే కురేషి వారికి అం దజేస్తామన్నారు. రంజాన్ రోజున ముస్లింలందరూ స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతివ్వానిఇ మునిసిపల్ కమిషనర్‌కు లేఖ రాసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణను శ్రీరామ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే వాసు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 15: ప్రభుత్వ బోధనాసుపత్రిలోని మార్చురీ అసిస్టెంట్లకు రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైద్యాధికారులను కోరారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ బోధనాసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. వైద్యసేవలు ఎలా అందుతున్నాయని వైద్యం కోసం వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్చురీలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది మృతుల కుటుంబీకుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకాధికారికి ఫోన్ చేసి రొటేషన్ విఽధానంలో డ్యూటీలు వేయాలని పేర్కొన్నారు. ఓపీ సేవలు మెరుగుపరచాలని, వైద్యసేవలను మరింత త్వరగా అందిం చాలని ఎమ్మెల్యే వాసు అన్నారు.