Share News

వెరీ..వెరీ.. గుడ్డూ!

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:12 AM

కోళ్ల రైతులకు వెరీ వెరీ గుడ్డు.. కొనుగోలుదారులకు మాత్రం వెరీ వెరీ బ్యాడ్‌.. ఎందుకంటే గుడ్డు ధర అమాంతం పెరిగిపోతోంది..

వెరీ..వెరీ.. గుడ్డూ!

అమాంతం పెరిగిన గుడ్డు ధర

కోళ్ల సంఖ్య తగ్గడమే కారణం

తగ్గిన కోడిగుడ్లు ఉత్పత్తి

బహిరంగ మార్కెట్‌ డిమాండ్‌

సరఫరా లేక పెరిగిన ధర

రిటైల్‌ మార్కెట్‌లో ఒక్కటి రూ.8

అనపర్తి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కోళ్ల రైతులకు వెరీ వెరీ గుడ్డు.. కొనుగోలుదారులకు మాత్రం వెరీ వెరీ బ్యాడ్‌.. ఎందుకంటే గుడ్డు ధర అమాంతం పెరిగిపోతోంది.. రికార్థు స్థాయి కి చేరుతోంది.కోళ్ల ఫారం వద్ద ఏకంగా రూ.6.75 పైసలకు గుడ్డు ధర చేరడంతో రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో గుడ్డు ధర రూ.8ల వరకూ విక్రయిస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు.గత కొనేళ్లుగా ధరలు లేక ఉసూరుమంటు న్న కోళ్ల రైతులు ఈ ఏడాది గుడ్డు ధర రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తు న్నారు.రిటైల్‌ మార్కెట్‌లో రూ.5 నుండి రూ.6 వరకు దొరికే గుడ్డు ప్రస్తుతం రూ.8 వరకు ప లకడంతో వినియోగదారుడు ఉసూరుమంటున్నాడు.

తగ్గిన కోళ్లు.. పెరిగిన ధర..

గత ఐదేళ్లుగా కోళ్ళ పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నెట్టుకొస్తోంది. గుడ్డు ఒక్కంటికి సుమారు రూ.5ల వరకు ఖర్చవు తుండడం సీజన్‌లో కూడా అతికష్టంగా రూ.6 లకు చేరుకుని వెంటనే పతనం కావడంతో కోళ్ల రైతులు అనేక నష్టాలను చవిచూశారు. గతే డాదిలో అనేక తెగుళ్లు కోళ్ళపై దాడి చేయడంతో రైతులు తమ ఫారాల్లో కోళ్ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.సుమారు లక్ష కోళ్లు ఉం డా ల్సిన ఫారంలో ప్రస్తుతం 60 నుంచి 70 శాతం మాత్రమే ఉన్నాయి. సుమారు 30 నుంచి 40 శాతం దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ధర రికా ర్డు స్థాయికి చేరిందని రైతులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 1.30 కోట్ల కోళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 90 లక్షల కోళ్లు మాత్రమే ఉన్నాయి. రూ.1 కోటి వరకు ఉత్పత్తి కావాల్సిన గుడ్లు ప్రస్తుతం సుమారు 65 లక్షల నుంచి 70 లక్షలు మాత్రమే ఉత్పత్తి కావడంతో ఈ ఏడాది వింటర్‌ సీజన్‌లో గుడ్డు ధరకు రెక్కలు వచ్చినట్టు చెబుతున్నారు.

కలిసొచ్చిన సీజన్‌..

సాధారణంగా చలి కాలంలో గుడ్డు వినియోగం పెరగడంతో ధరలు పెరగడం ఆనవాయితీ.ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తరాధి రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం పెరగడం దానికి తగినట్టుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని అయితే డిసెంబరు ప్రారం భం వరకు రూ.6కే పరిమితమైన గుడ్డు ధర 15 రోజుల్లో మరో 0.75 పైసలు పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఈ ధర జనవరి నెలాఖరు వరకు నిలబడితే కొంత మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. గుడ్డు ధర రూ.6.75 పైసలు పలికినప్పటికీ కమీషన్‌ పోను తమకు మిగిలేది రూ.6.50 పైసలు మాత్రమేనని రైతులు చెబుతున్నారు.ఏది ఏమైనా కోళ్ల పరిశ్రమపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి రాయితీలందించాలని రైతులు కోరుతున్నారు. తక్కువ ధరతో ఎక్కువ పోషకాలందించే గుడ్డు ధర బహిరంగ మార్కెట్‌లో రూ.8 చేరుకోవడం తో వినియోగదారులు నిరుత్సాహపడుతున్నా రు.ఇప్పటికే అనేక కుటుంబాల్లో ఉడికించిన గుడ్డు తినడం అలవాటు చేసుకున్న ఎగ్‌ ప్రి యులు పెరిగిన ధరతో ఉసూరుమంటున్నారు.

Updated Date - Dec 15 , 2025 | 01:12 AM