గుడ్డు..రికార్డు
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:19 AM
కోడి గుడ్డు రికార్డు.. ఎన్నడూ లేనంతగా ధర పెరిగిపోయింది. ఽధర ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకోవడంతో కోళ్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత రికార్డు అధిగమించిన ధర
గతేడాది రూ.6.30
ఈ ఏడాది 65 పైసలు పెంపు
రూ.7లు దాటుతుందని అంచనా
బహిరంగ మార్కెట్‌లో రూ.8
పౌలీ్ట్ర రైతుల ఆనందం
అనపర్తి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కోడి గుడ్డు రికార్డు.. ఎన్నడూ లేనంతగా ధర పెరిగిపోయింది. ఽధర ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకోవడంతో కోళ్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రూ.6.75పైసలు ఉన్న గుడ్డు ధర నేటికి మరో రూ.0.20 పైసలు పెరిగి రూ.6.95కి చేరుకుంది. పౌలీ్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విదంగా గుడ్డు ధర పెరిగింది. గతేడాది డిసెంబరు 11 నాటికి గుడ్డు ధర రూ.6.30 పైసలకు చేరుకుని వారం రోజుల పాటు అదే ధర నిలబడి రికార్డు సాధించగా ఈ ఏడాది డిసెంబరు ఆఖరి వారం చేరుకునే సరికి ఏకంగా రూ.6.95పైసలకు చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాదిలో డిసెంబరు ప్రారంభం నాటికే రికార్డుకు చేరుకున్న గుడ్డు ధర మూడో వారం ముగిసే సరికే సరి కొత్త రికార్డును సృష్టించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరింత పెరిగే అవకాశం..
25న క్రిస్మస్, 31న పాత సంవత్సర వీడ్కో లు వంటి రోజులు ఉండడంతో గుడ్డు వినియోగం పెరుగుతుందని దీనికి తోడు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ ధర వచ్చే వారం రోజుల్లో మరింత పెరిగి రూ.7 ల మార్కు దాటుతుందని సీనియర్ పౌలీ్ట్ర రైతు లు చెబుతున్నారు. డిసెంబరు నెలలో కూడా ఒకటి రెండు సార్లు ధర వెనుకకు వచ్చినప్పటికీ ఒకటి రెండు రోజుల్లోనే పుంజుకుందని రైతులంటున్నారు. పేపర్ ధర రూ.6.95కి చేరుకోవడంతో బహిరంగ మార్కెట్లో ఇప్పటికే రూ.8 పలుకుతున్న గుడ్డు ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని గుడ్డు ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా కోళ్ళ రైతులకు 2025 వ్యాపారం అందించిందనే చెప్పవచ్చు. ఈ ధర ఉన్నందుకు దిగుబడి కూడా ఉంటే తాము అదృష్టవంతులం అయ్యే వారిమని కోళ్ళ సంఖ్య తగ్గడంతో దిగుబడి తగ్గిందని అయినప్పటికీ గత ఐదారేళ్లలో ఈ ఏడాది గుడ్డు ధర మంచి ప్రోత్సాహం అందించిందని కొందరు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో చలి తీవ్రత తగ్గితే నెలాఖరు రాకుండానే ధర పడిపోయే ప్రమాదం లేకపోలేదని కొందరు రైతులు అంటున్నారు. అయితే ఇటీవల గుడ్డు వినియోగం కూడా బాగా పెరి గింది. ఈ నేపథ్యంలోనే డిమాండ్ వచ్చిప డింది. డిమాండ్‌కు తగినట్టు సరఫరా లేకపోవ డంతో అంతకంతకూ పెరుగుతూపోతోంది. దీంతో పౌలీ్ట్ర లాభాల బాట పట్టింది.