వెరీ..వెరీ.. గుడ్డు!
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:51 AM
ఎన్నడూ లేనిది కార్తీకమాసంలో గుడ్డు ధర పరుగులు పెడుతోంది. ప్రతి ఏడాది కార్తీకమా సంలో గుడ్డు ధర తక్కువగా ఉండేది.
ఒక్కో గుడ్డు హోల్‌సేల్ రూ.6
రిటైల్‌లో రూ.7కి విక్రయం
ధరలకు రెక్కలు
వినియోగదారులకు చుక్కలు
పౌలీ్ట్ర రైతులకు ఊరట
కూరగాయలతో పోటీ
లాభాల్లో రైతాంగం
మండపేట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఎన్నడూ లేనిది కార్తీకమాసంలో గుడ్డు ధర పరుగులు పెడుతోంది. ప్రతి ఏడాది కార్తీకమా సంలో గుడ్డు ధర తక్కువగా ఉండేది. ఎందు కంటే ఈ మాసంలో శాకాహారులు ఎక్కువగా ఉంటారు. దీంతో ఎప్పుడూ గుడ్డు ధర తక్కు వగా ఉండేది. అయితే దానికి భిన్నంగా ఈ ఏడాది మాత్రం పరుగులు పెడుతోంది. కోళ్ల ఫారాల నిర్వాహకులకు లాభాలు పండిస్తుంటే సామాన్యుడు మాత్రం గుడ్డు తినలేని పరిస్థితి కనిపిస్తోంది. గత రెండేళ్ల పాటు పౌలీ్ట్ర పరిశ్రమ ఒడిదుడుకులు చెందగా ఇప్పుడిప్పుడే పరిశ్రమ కుదుటపడుతోంది. గతం లో పరిశ్రమ నష్టాల కారణంగా చాలా మంది రైతులు కోళ్ల ఫారా లను మూసివేశారు.కొంతమంది అయితే బ్యా చ్‌లు వేయలేదు. గతంలో అయితే బ్యాచ్‌లు వేసి గుడ్లు ఉత్పత్తి చేసేవారు. ప్రస్తు తం ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌కు సరిపడా సరుకు లేకపోవడంవల్ల ధరలు పెరుగుదలకు కారణ మని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గుడ్డు ఉత్పత్తికి రూ.4.80 పైసలు అవుతుంది. రూ.5 దాటి ధర ఉంటేనే గిట్టుబాటు ఉం టుందని పౌలీ్ట్ర రైతులు అంటున్నారు.
గుడ్డు ధర ఊరట
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 300 వర కు కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో 1.40 కోట్ల మేర కోళ్లను పెంచుతున్నారు.రోజుకు 1.10 కోట్ల మేర గుడ్లు ఉత్పత్తి జరుగుతోంది. 40 శాతం స్థానిక అవసరాలకు విని యోగిస్తుండగా 60 శాతం గుడ్లు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరు గుతుంటాయి. ప్రభుత్వం అంగన్‌వాడీలు, పాఠ శాలలు, వసతిగృహాలు, ఆస్పత్రుల్లో గుడ్లు అం దిస్తోంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు, ఇంట్లోని వంటకాల్లో కూరలకు గుడ్లు విరివిగా వాడుతు న్నారు. గుడ్డు భలే ఫుడ్ అన్నట్టుగా మారింది. డిమాండ్‌కు తగ్గట్టుగా గుడ్లు ఉత్పత్తి లేకపోవ డంతో పాటు శీతాకాలం కావడంవల్ల వినియో గం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా కోళ్ల పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోగా ఇప్పుడు కాస్తంత పెరిగిన గుడ్డు ధర ఊరటని స్తోందని పౌలీ్ట్ర నిర్వాహకుడు తాడి శేషారెడ్డి తె లిపారు. కాసింత లాభాలు చూస్తున్నామన్నారు.
గతేడాది రూ.5.65
కార్తీకమాసంలో కాయగూరల ధరలు ఆకా శాన్నంటుతున్నాయి. కనీసం గుడ్డు కొనుగోలు చేసి కూర వండుకుందామంటే బయట రూ.7 నుంచి రూ.7.50 వరకు విక్రయిస్తున్నారు. దీంతో గుడ్డు కూడా తినలేని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు. గతేడాది నవంబరులో గుడ్డు ధర రూ.5.65 ఉండగా ఇప్పుడు ఇదే మాసంలో రూ.6కి చేరింది. చిల్లరగా గుడ్డు ధర బయట మార్కెట్‌లో రూ.6.50 నుంచి రూ.7లకు వరకు విక్రయిస్తు న్నారు.మొత్తం మీద కార్తీకంలో గుడ్డు ధర నిర్వాహకులకు ఊరటనిస్తుంటే కొనుగోలు దారులకు మాత్రం నీరసం కలిగిస్తోంది.
రాయితీలు కల్పించాలి
పరిశ్రమలో కోళ్లకు వాడే మేతల ధరల పెరు గుదల, మందుల ధరలు పెరగడం భారం గా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు. కోళ్ల మేతలకు సంబంధించి ముడిసరుకు ధరలు పెరగడం తమకు భారంగా మారా యని నిర్వాహకులు చెబుతున్నారు. 2019లో ముడిస రుకు ధరలు తక్కువ ఉండడం వల్ల లాభాలు వచ్చాయని అంటున్నారు. ఇప్పుడు పెరిగిన దాణాల ధరలు తమకు భారంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పొరుగు రాష్ట్రాలైన యూపీ, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా తదితర రాష్ట్రాల్లో సబ్సిడీలు ఇస్తుండగా ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదు. దానివల్ల ఇక్కడ రైతులు మార్కెట్ ధరపైనే ఆధారపడాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాల్లా ఇక్కడా ప్రభుత్వం కోళ్లపరిశ్రమలకు రాయి తీలు కల్పించాలని, ముడిసరుకు ధరల నియంత్రణకు చర్యలు తీసుకుని ఆదుకోవా లని పౌల్ర్టీ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.