విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - May 04 , 2025 | 12:57 AM
ప్రభుత్వం పేదల విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో 70 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.64,01,967 సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ అందజేత
70 మందికి రూ.64 లక్షల విలువైన చెక్కులు పంపిణీ
కొవ్వూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేదల విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో 70 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.64,01,967 సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. శనివారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవ్వూరు మండలంలో 23 మం దికి రూ.25,13,119లు, పట్టణంలో 10 మందికి రూ.9,95,478, తాళ్లపూడి మండలంలో 11 మం దికి రూ.4,10,547, చాగల్లు మండలంలో 26 మందికి రూ.24,82,823 సీఎంఆర్ ఎఫ్ నుంచి మంజూరయ్యాయ న్నారు. కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, అర్బన్‌బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, నామన పరమేశ్వరరావు పాల్గొన్నారు.
నాలుగు గ్రామాల్లో అందజేత..
చాగల్లు, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు చేతుల మీదిగా లబ్ధిదారులకు అందజేశారు. చాగ ల్లులో జరిగిన కార్యక్రమంలో మండలంలోని చాగల్లులో మూ డు కుటుంబాలు, బ్రాహ్మణగూ డెం రెండు, నెలటూరు, నందిగం పాడు గ్రామాలకు చెందిన ఒక్కొ క్కరికి కలిపి రూ.13 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజే శారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొంగ రామకృష్ణ, పీవీ సుబ్బారావు, గారపాటి మారుతి పాల్గొన్నారు. కాగా దారవ రం గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకటేశ్వరరా వుకు ఆరోగ్య సమస్యల రీత్యా మంజూరైన రూ.1.34 లక్షల చెక్కును ఎమ్మెల్యే ముప్పిడి వెం కటేశ్వరరావు కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.