Share News

అధికారుల తీరు మారదా?

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:37 AM

కాకినాడ/కాకినాడ సిటీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అది నాలుగు జిల్లాలకు సంబంధించిన కీల క సమావేశం. అయినా అందులో రెండు జిల్లాల ఉన్నతాధికారులు హాజరుకాని వైనం.. ఇదే తీరు గత మూడు సమావేశాల నుంచి జరుగుతుండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశంలో ఎక్స్‌అఫీషియో సభ్యులు భగ్గుమన్నారు. ఆయా జిల్లాల అధికారులే లేక పోవడంతో జడ్పీ సమావేశం ఏ హడావుడి లేకు ండా సాదాసీదాగా సాగింది. రూ.1014 కోట్లతో జడ్పీ బడ్జెట్‌ను సభ్యులంతా కలిసి ఆమోదిం చారు. కాకినాడలోని జడ్పీ సమావేశమందిరంలో తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ బడ్జెట్‌, సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో కాకినాడ జి

అధికారుల తీరు మారదా?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ

సమావేశంలో ప్రజాప్రతినిధుల నిలదీత

జిల్లా ఉన్నతాధికారుల గైర్హాజరు.. కాకినాడ కలెక్టర్‌ మాత్రమే హాజరు

స్వచ్ఛ కార్యక్రమం కారణంగా హాజరుకాలేకపోయారని వివరణ

సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు

చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరి

రూ.1014 కోట్లతో జడ్పీ బడ్జెట్‌ ఆమోదం

కాకినాడ/కాకినాడ సిటీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అది నాలుగు జిల్లాలకు సంబంధించిన కీల క సమావేశం. అయినా అందులో రెండు జిల్లాల ఉన్నతాధికారులు హాజరుకాని వైనం.. ఇదే తీరు గత మూడు సమావేశాల నుంచి జరుగుతుండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశంలో ఎక్స్‌అఫీషియో సభ్యులు భగ్గుమన్నారు. ఆయా జిల్లాల అధికారులే లేక పోవడంతో జడ్పీ సమావేశం ఏ హడావుడి లేకు ండా సాదాసీదాగా సాగింది. రూ.1014 కోట్లతో జడ్పీ బడ్జెట్‌ను సభ్యులంతా కలిసి ఆమోదిం చారు. కాకినాడలోని జడ్పీ సమావేశమందిరంలో తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ బడ్జెట్‌, సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ తప్ప ఆ స్థాయి కేడర్‌గల అధికారులు మి గిలిన జిల్లాల నుంచి హాజరుకాలేదు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఉన్నతస్థాయి అధికారులెవరూ హాజరుకాలేదు. దీంతో సమావేశానికి హాజరైన ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో ఒకరైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రంగా మండిపడ్డారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరరావు, ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, కుడుపూడి సూర్యనారాయణ ప్రజా సమస్యలపై అధికారులను నిలదీశారు. దీనికి కాకి నాడ జిల్లా కలెక్టర్‌ కలుగజేసుకుని సర్దిచెప్పే ప్ర యత్నం చేశారు. తర్వాత సమావేశానికి అందరూ హాజరయ్యేలా సమన్వయం చేసుకుంటామన్నారు. ‘స్వచ్ఛఆంధ్ర- స్వచ్ఛదివస్‌’ కార్యక్రమంలో భాగ ంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు బిజీ షెడ్యూల్‌ ఉండడంతో రాలేకపోయారని వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు చెల్లించలేదని విద్యార్థుల హా ల్‌ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని, దీనిపై సీరియస్‌గాస్పందించాలని కలెక్టర్‌ను కోరారు.

రెండో పంటకు నీటి విడుదలపై..

ఉమ్మడి జిల్లాలో రెండో పంటకు నీటిని విడుదల చేసే అంశాన్ని సమావేశంలో పలువురు జడ్పీటీసీలు లేవనెత్తగా ఇరిగేషన్‌ అధికారులు వివరణ ఇచ్చారు. శివారు ప్రాంత పొలాలకు నీటిని సరఫరా చేయాలని రాజోలు జడ్పీటీసీ మట్టా శైలజ కోరారు. రేషన్‌ బియ్యం నాసిరకం గా ఉంటున్నాయని చెప్పడంతో.. దానిపైనా విచారణ జరపాలని ఎమ్మెల్యే వేగుళ్ల, మరో జడ్పీటీసీ కలెక్టర్‌ను కోరారు. దీనిపై కాకినాడ కలెక్టర్‌ వివరణ ఇస్తూ కొత్త పంట కావడంతో అన్నం ముద్దగా అవుతుం దని, బియ్యంలో పోషకాలు కలిపాకే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తామని బదులిచ్చారు.

నీరు దారి మళ్లిస్తే కేసులు : కలెక్టర్‌ సీరియస్‌

పంటపొలాలకు నీళ్లు ఇచ్చే విషయమై తాళ్లరేవు జట్పీటీసీ దొమ్మేటి శామ్యూల్‌ మాట్లాడారు. దిగువనన పంటలకు సకాలంలో నీరు వదలడంలేదని అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై కాకినాడ కలెక్టర్‌ స్పందిస్తూ ఇరిగేషన్‌ కాలువలకు ఎగువనున్న కొందరు రైతులు, దిగువనున్న పొలాలకు నీళ్ల రానివ్వకుండా అడ్డుకట్టలు వేయడం సరైన విధానం కాదని మండిపడ్డారు. చదువుకున్న వాళ్లయ్యి ఉండి.. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. వంతులవారీగా నీళ్లు ఇస్తున్నా కొందరు మోటార్లు పెట్టి లాగేస్తున్నారని, అందులో డాక్టర్లు, ఇంజినీర్లు వంటి వారు కూడా ఉన్నారని, ఆఖరికి ఇంజినీరింగ్‌ ఏఈని కూడా కాజులూరులో బెదిరించారని, ఈసారి ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని కలెక్టర్‌ తీవ్రంగా హెచ్చరించారు.

జనరిక్‌ మందులపై అవగాహన కల్పించాలి

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలను జిల్లాల్లో విస్తృతంగా నిర్వహించాలని, ఆరోగ్యంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటుచేసిన జనరిక్‌ మందుల షాపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కోరారు. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్‌ స్లిప్పులు జారీ చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు. గిరిజన ప్రాంత ప్రజా సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఐటీడీఏ జనరల్‌ బాడీ సమావేశాలకు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఎమ్మెల్సీ అనంతర ఉదయ్‌ భాస్కర్‌తో పాటు, ఏఎస్‌ఆర్‌ జిల్లా పరిధి జడ్పీటీసీలు కోరగా.. ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం స్పందిస్తూ ఏప్రిల్‌ చివరి లేదా మే తొలివారంలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తమ జిల్లాలకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్‌.చినరాముడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా డీఆర్‌వో రాజకుమారి సభ్యులకు తెలిపారు. బడ్జెట్‌ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులు, అధికారులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జడ్పీ సీఈవో వీవీవీఎస్‌ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో రామ్‌గోపాల్‌, ఏవో ఎం.బుజ్జిబాబు పాల్గొన్నారు.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా...

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.70 లక్షల మిగులుతో రూ.1014కోట్ల బడ్జెట్‌ను ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ ఆమోదించింది. జడ్పీ చైర్మన్‌ వేణుగోపాలరావు అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం జరిగింది. సమావేశంలో 2024-25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ను, 2025-26 సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను చర్చించి ఆ మోదించారు. 2024-25 సవరణ బడ్జెట్లో ఆదాయం రూ.846.60కోట్లు, వ్యయం రూ.845.95 కోట్లుగా చూపుతూ.. రూ.65 లక్షల మిగులుతో రివైజ్డ్‌ బడ్జెట్‌ను ఆమోదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలిపి మొత్తం ఆదాయం రూ.1013.80కోట్లు కాగా, అన్ని పద్దుల కింద వ్యయం రూ.1013.10కోట్లు కాగా.. రూ.70 లక్షలు మిగులుగా చూపారు. ఆదాయంలో జడ్పీ సాధారణ నిధులు రూ.28కోట్లు, ప్రభుత్వం నుంచి కేటాయించే శాలరీ గ్రాంట్లు రూ.10.48 కోట్లు, నిర్దిష్ట గ్రాంట్లు రూ.46.09 కోట్లు, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, ఇత రశాఖల ద్వారా వచ్చే గ్రాంట్లు రూ.922.39 కోట్లుగా ఉన్నాయి. జడ్పీ సాధారణ నిధుల నుంచి షెడ్యూల్డ్‌ కులాల సంక్షే మానికి 15శాతం రూ.2.97కోట్లు, షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమానికి ఆరుశాతం కేటాయింపు రూ.1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15శాతం కేటాయింపు రూ.2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23 శాతం నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌నుసమావేశం ఆమోదించింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి: ఎమ్మెల్యే వేగుళ్ల

ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంలో నిబంధనలు ఏం చెబుతున్నాయని మండపేట ఎ మ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రశ్నించారు. తక్కువ ఖర్చు చేసిన జిల్లాల నుంచి నిధులను వేరే జిల్లాలకు బదలాయించుకోవచ్చా అని ప్రశ్ని ంచారు. తనకు తెలిసి ఉండగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో అలాంటి నిబంధనలేవీ లేవని, ఏ జిల్లాకు కేటాయించిన నిధులు ఆ జిల్లాలోనే ఖర్చు చేయాలని, పక్క జిల్లా నుంచి నిధులు తెచ్చే ప్ర యత్నం చేస్తున్నామని ఏ విధంగా చెబుతున్నారని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో కాస్త తడబడిన కలెక్టర్‌ తనకు దీనిపై పూర్తి అవగాహన లేదని, నిబంధనలు నిశితంగా పరిశీలిస్తానని వివరణ ఇచ్చారు.

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ ఇబ్బందులు: ఎమ్మెల్సీ ఇళ్ల

విద్యార్థుల హాల్‌ టికెట్లు వాట్సాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం విద్యాశాఖ కల్పించినా ఫీజులు చెల్లించలేదని యాజమాన్యాలు ఏ విధంగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తాయని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. నర్సింగ్‌ కళాశాల పరీక్షల హాల్‌ టికెట్లు మాత్ర మే వాట్సాప్‌లో రాని పరిస్థితి ఉంది.. వాటిపై దృష్టిపెడతామని స్పష్టం చేశారు.

Updated Date - Mar 16 , 2025 | 12:37 AM