జిల్లాలో రూర్బన్ పంచాయతీలు 31
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:30 AM
జిల్లాలో ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదా యం ఉండే పంచాయతీలను రూర్బన్ పంచాయ తీలుగా మార్చారు. అయితే గెజిట్‌లో వీటిని ప్రక టించవలసి ఉంది. ఈ నవంబరు నెలలోనే అధికా రిక ప్రకటన రావొచ్చు. జిల్లాలో మొత్తం 299 గ్రా మ పంచాయతీలు ఉండగా, వాటిలో రాజమహేం ద్రవరం డివిజన్‌లో 20, కొవ్వూరు డివిజన్‌లో 11 పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా అంటే, రూర్బన్ పంచాయతీ
రాజమహేంద్రవరం డివిజన్‌లో 20
కొవ్వూరు డివిజన్‌లో 11
కార్పొరేషన్‌లో విలీనమయ్యే వాటిని కూడా ప్రతిపాదించారు
వాటి సంగతేంటో..
మొత్తం పంచాయతీలు 299
ఇక పీడీవోలుగా సెక్రటరీలు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదా యం ఉండే పంచాయతీలను రూర్బన్ పంచాయ తీలుగా మార్చారు. అయితే గెజిట్‌లో వీటిని ప్రక టించవలసి ఉంది. ఈ నవంబరు నెలలోనే అధికా రిక ప్రకటన రావొచ్చు. జిల్లాలో మొత్తం 299 గ్రా మ పంచాయతీలు ఉండగా, వాటిలో రాజమహేం ద్రవరం డివిజన్‌లో 20, కొవ్వూరు డివిజన్‌లో 11 పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా అంటే, రూర్బన్ పంచాయతీలుగా ప్రతిపాదించా రు. ప్రభుత్వం రూ.కోటి ఆదాయం దాటిన అన్నిం టిని ప్రతిపాదించమని చెప్పడంతో జిల్లాలో రాజ మహేంద్రవరం డివిజన్ పరిధిలో అనపర్తి, బలభ ద్రపురం, బిక్కవోలు, గోకవరం, వేమగిరి, కడియపు లంక, కడియం, కోరుకొండ, దివాన్‌చెరువు, పాలచ ర్ల, రంగంపేట, కోలమూరు, ధవళేశ్వరం, హుకుం పేట, బొమ్మూరు, పిడింగొయ్యి, కాతేరు, రాజవోలు, శాటిలైట్‌సిటీ, కొవ్వూరు డివిజన్ పరిధిలో చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, పంగిడి, నల్లజర్ల, పోతవ రం, సమిశ్రగూడెం, ఖండవల్లి, పాలంగి, వేలివె న్ను, ఉండ్రాజవరం గ్రామ పంచాయతీలను ప్రతి పాదించారు. కానీ వీటిలో కొన్ని మాత్రమే అనుమ తి పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజమ హేంద్రవరం రూరల్ మండలం పరిఽధిని గ్రామాల ను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విలీన ప్రక్రి య ఉంది. కానీ ఇక్కడ వాటిని కూడా రూర్బన్ పంచాయతీలుగా అధికారులు ప్రతిపాదించారు. విలీన ప్రక్రియకు లేకపోతే అవి రూర్బన్ పంచా యతీలుగా ఉండే అవకాశం ఉంది. రాజమహేం ద్రవరం నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దే నేప థ్యంలో ఈ గ్రామాలన్నీ విలీనం అవ్వాలనే ఆలోచ న కూడా ఉంది. వీటితోపాటు రాజానగరం మండ లంలోని కొన్ని పంచాయతీలు, కోరుకొండ మండ లంలోని కొన్ని పంచాయతీలు, కడియం మండ లంలోని వేమగిరితో కలిపి మహానగరం చేస్తే, చా రిత్రక నగరం మరింత అభివృద్ధి దిశగా పయని స్తుంది. వీటిపై ఇంకా స్పష్టత రావలసి ఉంది.
పంచాయతీల ప్రక్షాళన...
గ్రామ పంచాయతీల విధానాన్ని ప్రభుత్వం ప్ర క్షాళన చేసింది. ప్రతీ గ్రామం ఒక పంచాయతీగా ఉంటుంది. గతంలో రెండు మూడు పంచాయతీ లను కలపి ఒక క్లస్టర్‌గా పిలిచేవారు. ఇక ఏ పం చాయతీకి ఆ పంచాయతీనే ప్రత్యేక గుర్తింపుతో ఉంటుంది. అంతేకాక పంచాయతీ సెక్రటరీలను ఇక నుంచి పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (పీడీవో)లుగా మార్చిన సంగతి తెలిసిందే. అంతే కాక గ్రామ పంచాయతీల జనాభా, ఆదాయాన్ని అనుసరించి నాలుగు కేటగిరీలుగా విభజించారు. పెద్ద పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీ లు (రూర్బన్ పంచాయతీ)లుగా మార్చి, తర్వాత ఆదాయాన్ని జనాభాను బట్టి గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్ -3 పంచాయతీలుగా వర్గీకరించారు. జిల్లాలో మొ త్తం 299 పంచాయతీలు ఉండగా, అందులో 26 పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ (రూర్బన్) పంచా యతీలుగా గుర్తించారు. ఇవి గ్రామీణ, అర్బన్ ప్రాంతాల రెండింటి పోలికలతో ఉంటాయి. వీటికి డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారి ఉంటారు. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల మాదిరిగా ఇక్కడ కూడా ప్రణాళిక, ఇంజనీరింగ్, వాటర్ సప్ల య్, శానిటేషన్, రెవెన్యూ వంటి విభాగాలు ఉం టాయి. అందుకే వీటిని రూర్బన్ పంచాయతీలు అంటారు. ఇవి పట్టణాలుగా రూపొందుతున్న పం చాయతీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా లోని గ్రామీణ ప్రాంతాల్లో 6,24,412 మంది జనా భా ఉన్నారు. 2021 లెక్కల ప్రకారం రాజమహేం ద్రవరం డివిజన్‌లో కడియం, రంగంపేట, రాజాన గరం, సీతానగరం, గోకవరం, బిక్కవోలు, అనపర్తి, కోరుకొండ, రాజమండ్రి రూరల్ మండలాల పరిధి లోని పంచాయతీల పరిధిలో 7,49,122 మంది జనాభా ఉన్నారు. ఈ మండలాల పరిధిలోని ఏడా ది ఆదాయం రూ.60,82,89,533. ఈ లెక్కల ప్రకారం వాస్తవానికి జిల్లా నుంచి రాజమహేంద్ర వరం డివిజన్ నుంచి జిల్లా యంత్రాంగం 20 పం చాయతీలను స్పెషల్ గ్రేడ్‌గానూ, 42 గ్రేడ్-1గానూ, 64 గ్రేడ్-2గానూ, 21 గ్రేడ్-3గానూ ప్రతిపాదిం చారు. ఈ డివిజన్‌లో మొత్తం 246 పంచాయతీలు ఉన్నాయి. కొవ్వూరు డివిజన్‌లో జనాభా 6,24,412 మంది. ఇక ఈ డివిజన్‌లోని పంచాయతీల వార్షి కాదాయం రూ.30,97,60,376. వీటి ఆధారంగా జిల్లా అధికారులు ఈ డివిజన్ నుంచి 11 స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగానూ, 48 గ్రేడ్-1గానూ, 55 గ్రేడ్-2గానూ, 39 గ్రేడ్-3గానూ గుర్తించి ప్రతిపా దించారు. ఈ డివిజన్‌లో మొత్తం 153 పంచాయ తీలు ఉన్నాయి. ఇలా జిల్లాలో మొత్తం 299 పంచాయతీలు ఉండగా వీటి జనాభా మొత్తం. 13 లక్షల,73వేల534మంది, ఈ పంచాయతీల మొత్తం వార్షికాదాయం రూ.91,80,49,908. ఈ లెక్కల ప్రకారం స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా 31, గ్రేడ్-1 పంచాయతీలుగా 89, గ్రేడ్-2 పంచా యతీలుగా 119, గ్రేడ్-3 పంచాయతీలుగా 60ను విభజించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ వీటిలో కొన్ని మార్పులు జరుగుతున్నట్టు సమా చారం. త్వరలో స్పష్టత రానుంది.