Share News

ఇదేంటి బాస్‌!

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:37 AM

జిల్లాలోని పలు స్టేషన్లపై ఆరోపణలు తీవ్రం గా వస్తున్నాయి.సామాన్యుల గోడు పట్టించుకు నే వారే కరువయ్యారు. న్యాయం చేయండి మహాప్రభో అని వెళితే.. మా ఇంటి కొస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే ఏమిస్తారు అనే నాను డిని స్టేషన్‌లోని ఎవరి సామర్థ్యం కొద్దీ వారు నిజం చేస్తున్నారనే విమర్శలున్నా

ఇదేంటి బాస్‌!

అవినీతి అడ్డాలుగా పోలీస్‌ స్టేషన్లు

ప్రతి స్టేషన్‌లో మామూలే

లబోదిబోమంటున్న బాధితులు

సీఐల రూటు.. సెపరేటు

పేకాట బోర్డులు..సారాకు కొమ్ము

అర్ధరాత్రి హోటళ్లకో రేటు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని పలు స్టేషన్లపై ఆరోపణలు తీవ్రం గా వస్తున్నాయి.సామాన్యుల గోడు పట్టించుకు నే వారే కరువయ్యారు. న్యాయం చేయండి మహాప్రభో అని వెళితే.. మా ఇంటి కొస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే ఏమిస్తారు అనే నాను డిని స్టేషన్‌లోని ఎవరి సామర్థ్యం కొద్దీ వారు నిజం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ తీరు బాధితులను మరింత ఆవేదనకు గురి చేస్తోంది. జిల్లాలోని ఎస్పీ వద్ద అత్యంత కీలకమైన పోస్టులో ఎలాంటి ఆదేశాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళ డీజీపీ కార్యాలయం వద్ద దుమ్మెత్తిపో శారు.ఒకసారి సస్పెన్షన్‌కి సైతం గురైనా జిల్లా స్థాయిలో కీలకమైన విధు లు అప్పగించ డంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే సీఐ తీరుతో ఇప్పుడు జిల్లాలోని చాలా మంది సీఐలు లో లోపల కుమిలిపోతున్నారు.

అందని న్యాయం..

పోలీస్‌ స్టేషన్లలో చేయి తడిపితేనే పనవు తోంది. ఏ చిన్న పనిపై వెళ్లినా ఎంతో కొంత ముట్టచెప్పి రావాల్సిందే మరి..దీంతో చాలా మం ది పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటేనే భయపడిపో తున్నారు.పోలీస్‌ స్టేషన్‌ స్థాయిలో సామాన్యుల కు న్యాయం జరగడంలో జాప్యం జరుగు తోం దనే అపవాదులు వినవస్తున్నాయి. పెద్ద కేసుకు ఒక తీరు, సామాన్యుడైతే మరో ప్రవర్తన కనిపి స్తోంది. పలు స్టేషన్ల వద్ద సాయంత్రం, రాత్రి వేళల్లో గుంపులు ఎందుకు కనిపిస్తున్నాయో ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది. ఎఫ్‌ఐఆర్‌లు వేయడానికి అర్ధరాత్రి ముహూ ర్తాలు అధికమైపోయాయి. ఇక తమ గోడును ఎస్పీకి వినిపిస్తేనే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో అపసోపా లు పడి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాల యంలో నిర్వహించే గ్రీవెన్స్‌కి బాధితులు క్యూ కడుతున్నారు.వీరిలో పేద మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా సీఐ సార్లు ఎస్పీ కార్యాలయంపై సైతం నిఘా పెడు తున్నారంటే ఎంతకు తెగించారో అర్ధం చేసు కోవచ్చు. ఎస్పీ గ్రీవెన్స్‌ రోజున ఏదోక పనిపై స్టేషన్‌ నుంచి ఒక కానిస్టేబుల్‌ని ఎస్పీ కార్యాల యానికి సీఐ పంపిస్తున్నారు. అక్కడ ఫిర్యాదు దారులంతా వెళ్లిపోయే వరకూ సదరు కానిస్టేబుల్‌ పని పూర్తి కాదు!. తమ పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించి ఫిర్యాదుదారులంటే ఒడు పుగా మాట్లాడి.. సీఐ గారు పరిష్కరిస్తారంటూ తీసుకెళ్లి..అక్కడ సినిమా చూపిస్తున్నారు.

ప్రతి పనికో రేటు..

రాజమండ్రి డివిజన్‌లోని హైవే పరిధి ఉన్న స్టేషన్లపై తీవ్రంగా ఆరోపణలు ఉన్నాయి. పేకా ట బోర్డులు యథేచ్చగా నిర్వహిస్తున్నారు. హైవే ను ఆనుకొని ఉన్న స్టేషన్‌ పరిధిలో 10 రోజుల కిందటి వర కూ బోర్డుల్లో పేకలు కళకళ లాడి లక్షలు చేతులు మారాయి. ప్రస్తుతం కొద్ది రోజు లు ఎందుకనో రెస్ట్‌ ఇచ్చారు. హైవే పరిధి వచ్చే మరో స్టేషన్‌ పరిధిలో ప్రస్తుతం రెండు పెద్ద బోర్డులు నిర్వహిస్తున్నారని చెబు తున్నారు.ఈ స్టేషన్లకు లక్షల రూపాయల్లో ము డుపులు ముడుతున్నాయని సమాచారం. నాటు సారా కంపు కొండుతున్నా ఆ స్టేషన్లకు మాత్రం వాసన రావడం లేదు. కోడి పందేలు మామూ లే. సిటీలోని లాడ్జిల్లో, గంటల ప్రాతిపదికన అద్దెకు ఇచ్చే ఫ్లాట్లలో, రిసార్టుల్లో యథేచ్చగా జూదంతో పాటు అన్ని వ్యవహారాలు నడుస్తున్నా ఆయా సీఐలకు ఉద్దేశపూర్వకంగానే కనిపించడం లేదని అంటున్నారు. ఇక రాత్రి వేళ హోటళ్లు బార్లా తెరిచి ఉంటున్నాయి. దీనికో రేటు. రాత్రి తెరిచి ఉంచితే ఇంతని బేరం కుదుర్చుకున్నట్టు సమా చారం. దివాన్‌చెరువు జీరో జంక్షన్‌ వద్ద హోటల్‌ దానికి ఉదాహరణ. ఈ హోటల్‌ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్నా భయంలేదెందుకో మరి.

రూ.15 వేలిస్తేనే.. బైక్‌ ఇస్తాం..

కొవ్వూరులోని ఓ రైతు తన ద్విచక్ర వాహ నాన్ని మరమ్మతు నిమిత్తం మెకానిక్‌కి ఇవ్వ గా మాయమైంది. రాత్రి ఒక యువకుడు బైక్‌ చోరీకి పాల్పడినట్టు సీసీ ఫుటేజీల ద్వారా తెలిసింది.ఆ బైక్‌ రాజమ హేంద్ర వరంలోని హైవే పక్కన ఉన్న ఓ స్టేషన్‌ పరిధిలో రోడ్డు పక్కన దొరికింది. పోలీసుల కూఫీ లాగి బైక్‌ యజమా నికి ఫోన్‌ చేయగా స్టేషన్‌కు వచ్చాడు.రూ.15 వేలు ఇవ్వాలంటూ అతనితో స్టేషన్‌లో బేరం పెట్టారు. బాధి తుడు అంత ఇచ్చుకోలేనని చెబి తే.. 2015 మోడల్‌ కాబట్టి ఆ రేటు.. 2025 అయితే రూ.50వేలు కట్టాల్సిందేనంటూ గద్దించా రు. చివరికి కాళ్లావేల్లా పడితే రూ.5వేలు స్టేషన్‌ తీసుకొని బైక్‌ అప్పగించారు.

భయపెట్టి..సెటిల్‌మెంట్‌

ఒక సీఐపై గతంలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అతను ఇప్పుడూ అదే పరిస్థితిలో ఉన్నాడు. ఓ పీఎస్‌ పరిధిలో తెలగపాముల వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇల్లు కొనుక్కుంటే.. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ స్టేషనుకు పిలిపించుకుని నిలదీశారు. అతడిపై పెండింగ్‌ కేసులు ఉన్నాయని, ఎస్పీ, డీఎస్పీ గంజాయి కేసు పెట్టి జైలుకు పంపించమంటు న్నారని బెదిరించి గత నెలలో ఒక రోజంతా స్టేషన్‌లో ఉంచారు. అతడి తల్లి వెళ్లి రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టు సమాచారం. అంతకు ముందు అదే సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి ఆ వర్గంలో పెద్ద మనిషిగా చలామణీ అవుతున్న ఓ వ్యక్తి ద్వారా రూ.2 లక్షలకు సెటిల్‌ చేసుకున్నారని ఆరోపణ లున్నాయి.ఈ క్రమంలో మెడికల్‌ లీవ్‌పై చెక్కేయడానికి సదరు సీఐ ఎత్తుగడ వేస్తు న్నారని చెబుతున్నారు. మెడికల్‌ లీవ్‌పై వెళితే చార్జి మెమో వంటివి అందజేయడానికి, వీఆర్‌ లో పెట్టడానికి వీలుండదు. తొలుతగా నాలుగు వారాలు ఆ తరహా సెలవు తీసుకొని పొడిగిం చుకునే వెసులుబాటు ఉంది. అంతా సర్దు బాటు చేసుకొనే వరకూ మెడికల్‌ లీవ్‌ పాచిక పారిస్తారనే విమర్శలున్నాయి.

Updated Date - Dec 04 , 2025 | 01:37 AM