మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం : జేసీ
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:28 AM
దివాన్‌చెరువు, నవంబరు15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులపై నిత్య ఒత్తిడిని తగ్గించేందుకు, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కార్తీక వనసమారాధన ఎంతో దోహదం చేస్తుందని జేసీ వై.మేఘస్వరూప్ అన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కర వనంలో జిల్లా అట
దివాన్‌చెరువు, నవంబరు15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులపై నిత్య ఒత్తిడిని తగ్గించేందుకు, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కార్తీక వనసమారాధన ఎంతో దోహదం చేస్తుందని జేసీ వై.మేఘస్వరూప్ అన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కర వనంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అధికారుల కార్తీక వనమహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ అన్ని విభాగాల అధికార్లు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జేసీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అటవీ అఽధికారి వి.ప్రభాకరరావు మాట్లాడుతూ అటవీశాఖ అధికార్లు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. తొలుత ఉసిరిచెట్టు కింద పూజలు చేశారు. అనంతరం జేసీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, జిల్లా గృహనిర్మాణ సంస్థ పీడీ నాతిబుజ్జి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ ఎస్.భాస్కర్‌రెడ్డి, సీపీవో ఎల్.అప్పలకొండ, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎస్.మాధవరావు, జిల్లా అధికారిణిలుఎస్.సుభాషిణి, వి.శాంతామణి, పి.వీణాదేవి పాల్గొన్నారు.