Share News

త్వరలో జిల్లాలో 3 ప్రాజెక్టులకు శ్రీకారం

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:57 AM

జిల్లాలో త్వరలోనే మూడు ప్రధాన ప్రాజెక్టులకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేస్తారని మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని అఖండ గోదావరి ప్రాజెక్టు, రాజానగరంలో అటవీ అకాడమీ, బొమ్మూరులో సైన్సు మ్యూజి యం ప్రారంభోత్సవాలపై వివిధ శాఖల అధికా రులతో ఆయన శనివారం సమన్వయ సమావే శం నిర్వహించారు.

త్వరలో జిల్లాలో 3 ప్రాజెక్టులకు శ్రీకారం
పుష్కరఘాట్‌ వద్ద పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్‌, కలెక్టర్‌ ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

  • మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో త్వరలోనే మూడు ప్రధాన ప్రాజెక్టులకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేస్తారని మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని అఖండ గోదావరి ప్రాజెక్టు, రాజానగరంలో అటవీ అకాడమీ, బొమ్మూరులో సైన్సు మ్యూజి యం ప్రారంభోత్సవాలపై వివిధ శాఖల అధికా రులతో ఆయన శనివారం సమన్వయ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పష్టమైన కార్యాచరణతో ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదే శించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తొలుత అఖండ గోదావరి శంకుస్థాపన జూన్‌ 19న నిర్వహించ డానికి ఆలోచన చేశామని, అయితే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఉండడంతో ఆ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అనంతరం అధికారులతో కలిసి సభా వేదిక, బహిరంగ సభ ప్రాంతం తదితర ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్ర తీకగా నిలిచే విధంగా అఖం డ గోదావరి ప్రాజెక్టు నిర్మా ణం పూర్తి చేస్తామని ఆయ న స్పష్టం చేశారు. రాష్ట్రాలకు పెట్టుబడుల కింద కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక సహాయం నిధులు రూ.97 కోట్లు ఈ ప్రాజెక్టుకు మంజూరయ్యాయన్నారు. వీ టితో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూ రు, నిడదవోలుతోపాటు పలు ప్రాంతాల్లో పర్యా టక అభివృద్ధి పనులు చేపడతామన్నారు. 2027 లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ 127ఏళ్ల చరిత్ర కలిగి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన హేవలాక్‌ బ్రిడ్జిని ఆధునికీకరిస్తామన్నారు. వంతెన ప్రాంతంలో జలపాతాలు, గ్రాస్‌ వంతెనలు, గేమింగ్‌ జోన్‌, స్పేస్‌ థీమ్‌, అర్బన్‌ హ్యాండీ క్రాఫ్ట్‌ బజార్‌, హ్యాంగింగ్‌ గార్డెన్స్‌, హోలోగ్రామ్‌ జూ, టైమ్‌ ట్రా వెల్‌, రైల్‌ మ్యూజియం, అక్వేరియం టన్నెల్‌ వం టివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కర్‌ఘాట్‌ ను కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ నరసింహ కిషోర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జేసీ చిన్న రాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:57 AM