Share News

భూ.. తాలు!

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:57 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖలకు ఉచితంగా కేటాయించిన భూములు చాలా వరకు పరాధీనమయ్యాయి. కేటాయించిన అవసరాలకు బదులు పలువురు నేతల కబ్జాల్లోకి వెళ్లిపోయాయి. పేరుకు బయ టకు ప్రభుత్వ శాఖల అవసరాలకు ఉచితంగా కేటాయిస్తే వాటిని అనేకచోట్ల చెరబట్టి దారి మళ్లించేశారు.గత వైసీపీ సర్కారు హయాంలో అలియ నేషన్‌ పేరిట విలువైన ప్రభుత్వ భూములు వివిధ శాఖల అవసరాలకు ఉచి తంగా కేటాయించగా,వా

భూ.. తాలు!

ఫ్యాన్‌ కేటాయింపు.. అక్రమాల కంపు

ప్రభుత్వ భూమి.. ప్రైవేటు లొసుగు

భూకేటాయింపుల్లో అక్రమాలెన్నో

గత ప్రభుత్వంలో విచ్చలవిడితనం

5,700 ఎకరాలు పరాదీనం

భూముల్లో వైసీపీ నేతల పాగా

దృష్టిపెట్టిన కూటమి ప్రభుత్వం

జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం

అనేక చోట్ల అడ్డగోలు వ్యాపారాలు

కాకినాడ జిల్లాలో 4,601

కోనసీమ, తూర్పున 1,100

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖలకు ఉచితంగా కేటాయించిన భూములు చాలా వరకు పరాధీనమయ్యాయి. కేటాయించిన అవసరాలకు బదులు పలువురు నేతల కబ్జాల్లోకి వెళ్లిపోయాయి. పేరుకు బయ టకు ప్రభుత్వ శాఖల అవసరాలకు ఉచితంగా కేటాయిస్తే వాటిని అనేకచోట్ల చెరబట్టి దారి మళ్లించేశారు.గత వైసీపీ సర్కారు హయాంలో అలియ నేషన్‌ పేరిట విలువైన ప్రభుత్వ భూములు వివిధ శాఖల అవసరాలకు ఉచి తంగా కేటాయించగా,వాటిలో చాలా వరకు ఆపార్టీ నేతలే వాలిపోయి ఎంచక్కా అనుభవి స్తున్నారు. లీజులకు ఇచ్చేసి అడ్డగోలుగా జేబులు నింపేసుకుంటున్నారు. సబ్‌స్టేషన్లు, స్కూళ్లు, సచి వాలయాలు, ఆర్‌బీకేలు, బల్క్‌మిల్క్‌ సెంటర్లకు ఇచ్చిన స్థలాల్లోను పాగా వేసేశారు. ఈ తరహా కబ్జాలపై ప్రభుత్వం తాజాగా దృష్టిసారించింది. ఇంతవరకు ఎన్ని భూములు ఇలా కేటాయించ రనేదానిపై నివేదికలు రప్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో 5,700 ఎకరాల వరకు కేటాయించినట్టు ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేశారు.

విలువైన భూములు ఉచితంగానే..

రెవెన్యూశాఖ ఆధీనంలో ఉమ్మడి జిల్లాలో కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని ప్రభుత్వాలు రకరకాల అవసరా ల పేరుతో వినియోగించుకుంటున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలకు కావాలంటే రెవెన్యూ శాఖ నుంచి ఉచితంగా అలియనేషన్‌ కింద ప్రభుత్వం కేటాయిస్తూ వస్తోంది. కొన్ని కంపెనీలకు కావా లంటే ధర నిర్ణయించి వసూలు చేసి వాటికి కేటాయిస్తున్నాయి. ఇలా అలియనేషన్‌ కింద వివిధ ప్రభుత్వశాఖలకు ఉచితంగా కేటాయి స్తోన్న భూములు కాలక్రమేణా కబ్జాలకు గురవు తున్నాయి. కొందరు పలుకుబడి కలిగిన నేతలైతే ప్రభుత్వ శాఖల పేరుతో భూములు ఉచితంగా కొట్టేసి ఆనక వాటిలో పాగా వేసేస్తున్నారు. వీటి ని వ్యాపార అవసరాలకు కేటాయించడం, సొంత వ్యాపారాలకు గోదాములు నిర్మించడం వరకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధా నం గా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. అప్పట్లో జగన్‌ సర్కారు కొత్తగా తెచ్చిన సచివాల యాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌, చిల్లింగ్‌ కేంద్రా లకు ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అలియనేషన్‌ విధానంలో ఉచితంగా పంచాయతీరాజ్‌, ఆర్‌ డబ్ల్యూఎస్‌, పంచాయతీశాఖ, పశుసంవర్థకశా ఖలకు కేటాయించేశారు. కాలువల వెంబడి భూ ములను ఎడాపెడా ఇచ్చిపారేశారు.వీటిని కేటా యించిన అవసరాలకు కాకుండా ఆ ముసుగులో కొందరు వైసీపీ నేతలు మూడు జిల్లాల్లో పలు చోట్ల వాటిలో పాగా వేసేసి సొంత అవసరాలకు వాడుకుంటు న్నారు.దీంతో ప్రస్తుత ప్రభుత్వం వీటిపై కన్నేసింది. గత ఐదేళ్లలో ఏయే శాఖలకు వీటిని ఎంతెంత విస్తీర్ణంలో కేటాయించారు? వాటిలో అసలు ఎవరుంటున్నారు? ఆయా శాఖ ల అవ సరాలకు నిజంగానే వీటిని వాడుతు న్నారా? లేదా? అనేదానిపై పూర్తిస్థాయిలో నివే దికలు పంపాలని కోరింది. మండలాల వారీగా ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఏయేశాఖల కు కేటాయించారో లోతుగా వివరాలు పంపాలని ఆదేశించింది. జిల్లాల వారీగా రెవెన్యూశాఖ ఈ వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేసింది.

5700 ఎకరాల మాటేమిటి..

కాకినాడ జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన వేల కోట్ల విలువైన 4,601 ఎక రాల భూములను వివిధ శాఖల అవసరాలకు ఇప్పటి వరకు ఉచితంగా కేటాయించినట్టు నివేదికలో తేల్చారు. ఉమ్మడి జిల్లాలో ఇదే అత్యధికం. ఇందులో కాకినాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో 1,903 ఎకరాలు, పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో 2,697 ఎకరాలను ఉచితంగా కేటాయించారు. ఒక్క కాకినాడ రూరల్‌ మండలం లోనే వేల కోట్ల విలువైన 1,483 ఎకరాలు భూములను వివిధ ప్రభుత్వ శాఖల అవసరాల ముసుగులో ఉచితంగా కేటాయించేశారు. వీటిలో ఎక్కు వగా గత వైసీపీ హయాంలో కేటాయించినవే ఉన్నాయి. ప్రభుత్వశాఖలకు కేటాయించిన ఈ భూములను కొందరు వైసీపీ నేతలు తమ పలుకుబడితో కబ్జా చేసేసి సొంతంగా వాడుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ప్రైవేటుగా గోదాములు నిర్మించి అద్దెలకు ఇచ్చేసుకున్నారు. మరికొందరు లీజులకు ఇచ్చేశారు. కానీ భూమి పొందిన ప్రభుత్వ శాఖలు మాత్రం కిమ్మనడం లేదు. తొండంగి మండలంలో 2,405ఎకరాల్లో సగానికి పైగా కాకినాడ సెజ్‌ కు కేటాయించారు. మరికొంత పోలవరం కాలువ, సబ్‌స్టేషన్లకు కేటాయిం చారు. వీటిలోను అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. కోనసీమ జిల్లాలో గడచిన ఐదేళ్లలో 479 ఎకరాల వరకు కేటాయించారు. ఇందులో జల వన రులు, పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌కో, పంచాయతీశాఖలకే అధికంగా ఉన్నాయి. వీటిలోను అనేక చోట్ల ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల చెరువులు, కోళ్లఫారాలు, షెడ్లు నిర్మించేసి వాడేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌, అనపర్తి నియోజకవర్గాల్లో కేటాయింపులు జరగ్గా, వీటిలోను అనేకచోట్ల ఆయా శాఖలకు కేటాయించిన భూములపై నిఘాలేక ఇతరత్రా అవసరాలకు మళ్లిపోయినట్టు గుర్తించారు. తాజాగా ఉన్నతాధికారులు ఈ మేరకు భూకేటాయింపుల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 01:57 AM