Share News

జిల్లాలో 2 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:21 AM

జిల్లాలో 2 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉందని.. రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ చెప్పారు. మండలంలోని నరేంద్రపురం, తూర్పుగోనగూడెం గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలను జేసీ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు, ఏడీఏ డి.శ్రీనివాసరెడ్డి ఆదివారం సందర్శించారు.

జిల్లాలో 2 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా
ఇనుగంటివారిపేటలో యూరియా బస్తాలు దింపుతున్న దృశ్యం

  • జాయింట్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌

రాజానగరం, సెస్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉందని.. రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ చెప్పారు. మండలంలోని నరేంద్రపురం, తూర్పుగోనగూడెం గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలను జేసీ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు, ఏడీఏ డి.శ్రీనివాసరెడ్డి ఆదివారం సందర్శించారు. నరేంద్రపురం రైతు సేవా కేంద్రంలో జేసీ రైతులతో సమావేశ మయ్యారు. తూర్పుగోనగూడెంలో రైతులకు యూరియా అందిం చారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌వో తాతారావు, సర్పంచ్‌లు గళ్ళా సత్యశ్రీ, తంగెళ్ల ముసలయ్య, ఏవో ఎ.కళ్యాణసూర్యకుమార్‌, డిప్యూటీ తహశీల్దార్‌రాజు పాల్గొన్నారు

  • సీతానగరంలో 210 మెట్రిక్‌ టన్నులు

సీతానగరం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలానికి 210 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయాధికారి గౌరీదేవి తెలిపా రు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని 14 సొసైటీల ద్వారా యూరియా రైతులకు అందిస్తున్నామన్నారు. అయితే కొన్ని సొసైటీలలో యూరియా పెద్దగా అవసరం ఉండదని, దానిని దృష్టిలో ఉంచుకు ని సొసైటీకి 20 మెట్రిక్‌ టన్నులు(450 బస్తాలు )చొప్పున అందిస్తున్నామన్నారు. సొసైటీలకు 190 మెట్రిక్‌ టన్నులు, సీతానగరంలోని గ్రో మోర్‌ రిటైల్‌ సెంటర్‌కు 20 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందన్నారు. పంట నమోదు చే సిన రైతులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ఒకటి నుంచి రెండు బస్తాలను అందిస్తున్నామన్నారు. కొన్ని సొసైటీల వద్ద యూరియా అందని రైతులకు టోకెన్‌లు ఇచ్చారని, వారికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ముందుగా సొసైటీలకు అందుతుందని, రెండు రోజుల్లో రైతులకు అందిస్తామని వ్యవసాయాధికారి పేర్కొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:21 AM