Share News

ప్రకృతి వ్యవసాయం ద్వారానే నాణ్యమైన ఆహారం

ABN , Publish Date - Sep 25 , 2025 | 01:26 AM

అనపర్తి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి ప్రసాదించిన సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత లభించి తద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నా రు. బుధవారం అనపర్తి మహాలక్ష్మిపేటలో రైతు రాజగిరి శ్రీనివాస్‌ చేపట్టిన సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతు శ్రీనివాస్‌తో ముచ్చటిస్తూ సేంద్రియ వ్యవసాయానికి మామూలు పద్ధతికి తేడాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో విని

ప్రకృతి వ్యవసాయం ద్వారానే నాణ్యమైన ఆహారం
అనపర్తిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పిచికారి చేసేందుకు డ్రోన్‌లో నింపుతున్న సేంద్రియ ఎరువుల విధానాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ కీర్తి

రైతులను ఆ దిశగా పోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

అనపర్తిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి

అనపర్తి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి ప్రసాదించిన సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత లభించి తద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నా రు. బుధవారం అనపర్తి మహాలక్ష్మిపేటలో రైతు రాజగిరి శ్రీనివాస్‌ చేపట్టిన సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతు శ్రీనివాస్‌తో ముచ్చటిస్తూ సేంద్రియ వ్యవసాయానికి మామూలు పద్ధతికి తేడాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వినియోగిస్తున్న సేంద్రియ ఎరువులను వా టిని తయారు చేసుకునే విధానాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా తాను కౌలుకు చేస్తున్న భూమిలో ఒకటిన్నర ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవ లంభిస్తూ పండిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏ ఏడాదికాయేడాది ఎక్కు వ భూమిలో ప్రకృతి సాగు పెంచుతూ వస్తున్నానని అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా ఖర్చు తగ్గుతుందని, దిగుబడిలో పెద్ద మార్పు ఉండదని, ఎరువుల ఖర్చులో సగానికి సగం ఆదా అవడమే కాకుండా భూమిలో సారం పెరుగుతుందని ఆయన వివరించారు. ప్రత్యేక పద్ధతిలో రూపొందించిన పనిముట్ల ద్వారా ఊడ్పుల నుంచి కలుపుతీత వరకు వినియోగిస్తున్నామని, ప్రత్యేకంగా తయారుచేసిన జీవామృతాలను డ్రోన్‌ సహాయంతో పిచికారి చేయడం వల్ల శ్రమతోపాటు సమయం కూడా ఆదా అవుతున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా జరిగే మేలును మిగిలిన రైతులకు తెలిసేవిధంగా అవగాహన కల్పిస్తే ఎక్కువ మంది రైతులు ప్రకృతి సాగుకు మరలే అవకాశం ఉందన్నారు. పచ్చిరొట్ట ద్వారా భూసారం పెరుగుతుందని, తద్వారా యూరియా వాడకం కూడా తగ్గుతుందన్నారు. సేంద్రియ ఎరువుల తయారీలో రైతు లు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కౌలు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపునకు దృష్టి సారిస్తే ఖర్చులు తగ్గడ మే కాకుండా కుటుంబానికి ఆర్థికంగాను, ఆరోగ్యంగాను మేలు చేకూరుస్తుందన్నారు. భవిష్యత్‌లో సేంద్రియ వ్యవసాయంతో కూడిన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుందని ప్రజలు వ్యవ సాయ క్షేత్రాల వద్దకు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. అనపర్తి పరిసరాల్లో సుమారు 400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోందని ఇది మరింత పెరగాలని ఆమె అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌ మాధవరావు, సర్పంచ్‌ వారా కుమారి, ఏపీ సీఎంఎఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ తాతారావు, తహశీల్దార్‌ అనిల్‌కుమార్‌, రైతులు శ్రీనివాస్‌, చిట్టిబాబు, విశ్వనాథరెడ్డి, ఎమ్‌వీవీ రాఘవరెడ్డి, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 01:26 AM