Share News

‘మహిళలు ఆదాయ వనరులు సృష్టించడం అభినందనీయం’

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:43 AM

కడియం, అక్టోబరు10 (ఆంధ్రజ్యోతి): పూల వ్యర్థాలతో మహిళలు అగరబత్తీలు తయారు చేయడం, స్వయం ఉపాధి ద్వారా ఆదాయ వనరులు సృష్టించడం ప్రశంసనీయం అని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కడి యం ప్రాంతంలో అగరబత్తీల తయారీ యూని ట్‌, కొబ్బరి తాళ్ల యూనిట్లను కలెక్టర్‌ పరిశీలించారు. శిక్షణ పొందిన మహిళలతో సమావేశమై మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మా ర్కెటింగ్‌ దిశలో తగిన చర్యలు తీసు

‘మహిళలు ఆదాయ వనరులు సృష్టించడం అభినందనీయం’
మహిళా సంఘ సభ్యులు తయారు చేసిన అగరుబత్తీలను కలెక్టర్‌ కీర్తికి అందజేస్తున్న దృశ్యం

కడియం, అక్టోబరు10 (ఆంధ్రజ్యోతి): పూల వ్యర్థాలతో మహిళలు అగరబత్తీలు తయారు చేయడం, స్వయం ఉపాధి ద్వారా ఆదాయ వనరులు సృష్టించడం ప్రశంసనీయం అని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కడి యం ప్రాంతంలో అగరబత్తీల తయారీ యూని ట్‌, కొబ్బరి తాళ్ల యూనిట్లను కలెక్టర్‌ పరిశీలించారు. శిక్షణ పొందిన మహిళలతో సమావేశమై మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మా ర్కెటింగ్‌ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని యూనిట్లు స్థాపించేందుకు మహిళలు కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. డిమాండ్‌కు అనుగుణంగా యూనిట్‌ స్థాపన ఉండాలి... భవిష్యత్తులో ఏర్పాటు చేసే యూనిట్ల విషయంలో ముడిసరుకు, లభ్యత నుంచి మార్కెటింగ్‌ వరకు ప్రతీ అంశాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఆ మేరకు ఖచ్చితత్వం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. అలాగే మార్కెటింగ్‌ సహకారం కీలకమని, మహిళల చొరవతో కడియం నేచురల్‌ అగరబత్తీలు అనే ప్రత్యేక బ్రాండ్‌ రూపుదిద్దుకోవడం గర్వకారణమని కలెక్టర్‌ ఆ మహిళలను అభినందించారు. బ్యాంకు సహకారంతో తొలిదశలో 12 మంది మహిళలు యూనిట్‌ స్థాపనకు ముందుకు రావడం ప్రశంసనీయం అన్నారు. అనంతరం కడియపులంక పుల్లా చం టియ్య - సత్యదేవానర్సరీని కలెక్టర్‌ కీర్తి చేకూరి సందర్శించారు. నర్సరీ అధినేత పుల్లా పెదసత్యనారాయణ మొక్కను అందజేసి కలెక్టర్‌ కీర్తి చేకూరికి స్వాగతం పలికారు. అలాగే కడియపులంక పూల మార్కెట్‌ను సందర్శించారు.

రూ7.32 కోట్లతో గ్రీనింగ్‌ కారిడార్ల అభివృద్ధి : కలెక్టర్‌ కీర్తి

గతేడాది ఆమోదించిన పనులు వందశాతం పూర్తిచేయాలి.. అధికారులతో సమీక్ష

రాజమహేంద్రవరంసిటీ, అక్టోబరు 10 (ఆం ధ్రజ్యోతి): గతేడాది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఆమోదించిన పనులు వందశాతం పూర్తి చేయాలని ఇంచార్జి కమిషనర్‌ జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో డిస్ట్రీక్‌ లెవెల్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ నిర్వహించారు. ఈసందర్భంగా నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఏపీ)కింద రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రూ7.32 కోట్లతో చేపడుతున్న గ్రీనింగ్‌ కారిడార్ల అభివృద్ధి పనులు, పెద్దమొక్కలు నాటడం, అలాగే అకిరా మియావాకి మోడల్‌ మొక్కలు పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. వాయుకాలుష్యం మ రింతగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని దిశనిర్దేశం చేశారు. ఈ-వేస్ట్‌ కలెక్షన్‌ సెంటర్ల నిర్వహణ మరింత క్రమబద్ధంగా చేపట్టాలని, 2030 నాటికి మొత్తం వాహనాల్లో కనీసం 30 శాతం వాహనాలు ఎలక్ర్టిక్‌ వాహనాలు ఉండే లా లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను సీఎన్‌జీ మోడ్‌కి కన్వె ర్ట్‌ చేసే చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పీసీబీ ఎన్విరాన్మెంట్‌ ఇం జనీర్‌ ఎంవీఎస్‌ శంకర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.మాధవరావు, కార్పొరేషన్‌ ఎస్‌ఈ ఇన్చార్జి రీటా, డీఈ కె.లోవరాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 01:43 AM