ఆశలు తీర్చింది.. ఆనందం నింపింది..
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:25 AM
2025..ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగుల ఆశలను నెర వేర్చింది.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ పోస్టుల భర్తీ జరింది. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిలు వు
టీచర్, కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ
నామినేటెడ్ పదవులన్నీ కేటాయింపు
ఉచిత బస్ పథకానికి శ్రీకారం
ప్రజాకాంక్షకు అనుగుణంగా విభజన
ఏజెన్సీ వాసులకు పోలవరం జిల్లా
ఇది మంచి ప్రభుత్వం.. చెప్పడం కాదు.. నిజమే కదా..! అవును మరి.. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా చూస్తే వచ్చే మాట ఇదే.. ఎందుకంటే నాడు హామీలు ఇచ్చారు.. అమలు మరిచారు.. మరి నేడు మాట ఇచ్చారు.. ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు.. అసలు 2025లో ప్రభుత్వం ఏం చేసిందో చూస్తే ఎవరైనా ఈ మాట అనకమానరు..
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలన్నారు.. ఎన్నో ఏళ్ల కలను నిజం చేస్తూ 1291 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు.. వీరు పాఠాలు చెబుతుంటే.. 250 మందిని కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపిక చేశారు.. వీళ్లు శిక్షణలో ఉన్నారు.. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించారు..
ఏజెన్సీ ప్రజల ఇబ్బందులను చూసి.. రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మండపేటను రాజమహేంద్రవరంలో.. పెద్దాపురం నియోజక వర్గాన్ని సామర్లకోట డివిజన్‌లో విలీనం చేశా రు. ఈ ఏడాది ఆగస్టు 15న ఉచిత బస్ పథకం స్త్రీ శక్తికి శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పర్యాటక రంగంపై దృష్టి పెట్టారు.. పుష్కరాల నేపథ్యంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి.
తమ వెంట నడిచేవారికే పదవులన్న మాటకు కట్టుబడి ఉన్నారు.. కూటమి నిష్పత్తికి తగినట్టు నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు సాగాయి. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు వరించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం చేసిందెన్నో.. ఎన్నెన్నో! మరో 24 గంటల్లో 2025కి బైబై చెప్పేసి.. 2026కి వెల్‌కమ్ చెప్పబోతున్నాం.. అందుకే 2025లో ఏమిచ్చిందనేది ఒకసారి జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లి చూడాల్సిందే మరి..
(కాకినాడ/రాజమహేంద్రవరం/ అమలాపురం,ఆంధ్రజ్యోతి)
2025..ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగుల ఆశలను నెర వేర్చింది.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ పోస్టుల భర్తీ జరింది. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిలు వునా మోసం చేస్తే.. కూటమి ప్రభుత్వం సర్కారీ కొలు వుల జాతర తెచ్చింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,241 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కాయి. 275 మందికి కానిస్టేబుళ్ల ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది.
ఆకాంక్షలే..ఆలంబనగా..
ఎన్నికల ముందు మాటిచ్చారు..నెరవేర్చారు. రంప చోడవరం,చింతూరు డివిజన్లను కలిపి ఏజెన్సీ వాసులకు పోలవరం కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సంఖ్య 4కి పెరిగింది. రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూ ర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గ పరిధి లోని మూడు మండలాలు విలీనమయ్యాయి. ఇప్పటి వరకు కాకినాడ డివిజన్‌లో ఉన్న పెద్దాపురం నియో జకవర్గాన్ని సామ ర్లకోట డివిజన్‌లో విలీనం చేశారు. ఇక పరిపాలనా పరంగా కూడా కొన్ని మార్పులు వచ్చాయి. డివిజన్ స్థాయిలో డీఎల్‌డీవో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కొన్ని పంచాయతీలను స్పెషల్ గ్రేడ్‌గా మార్చి రూర్బన్ పంచాయతీలుగా మార్చే నిర్ణయం తీసుకున్నారు. ఉచిత బస్ పథకానికి ఆగస్టు 15వ తేదీన శ్రీకా రం చుట్టారు. నాటి నుంచి మహిళలంతా బస్‌లో ఉచి తంగా ప్రయా ణిస్తున్నారు.కేవలం 4 నెలల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్లు తిరిగేసినట్టు సమాచారం.
నాయకులు వచ్చారిలా..
ఈ ఏడాది సీఎం చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో ఐదు సార్లు పర్యటించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉమ్మడి జిల్లాలో రెండు సార్లు పర్యటిం చగా పిఠాపురం నియోజకవర్గానికి అడపాదడపా వస్తూ నే ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ఒకసారి రాజమ హేంద్రవరంలో పర్యటించారు.
పదవులు వరించెన్!
కూటమి క్యాడర్‌లో సంబరాలు తెచ్చింది. ప్రభుత్వంలో నామి నేటెడ్,పార్టీలో సంస్థాగత పదవులు భారీస్థాయిలో దక్కడంతో సంబరాలు మిన్నంటాయి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి జవహర్ నియమితుల య్యారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్‌గా కుడిపూడి సత్తిబాబు, స్టేట్ స్కిల్ డెవ లప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బూ రుగుపల్లి శేషారావు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌ప ర్సన్‌గా రెడ్డి అనంతలక్ష్మి, డీసీసీబీ చైర్మన్‌గా తుమ్మల రామ స్వామి (బాబు), డీసీఎంఎస్ చైర్మన్‌గా పెచ్చెట్టి చంద్రమౌళి, అటు టీడీపీకి జిల్లా అఽధ్యక్షులుగా బొడ్డు వెంకట రమణ చౌదరి (తూర్పుగోదావరి), జ్యో తుల నవీన్(కాకినాడ), గుత్తుల సాయి (కోనసీమ) ఎంపికయ్యారు. పార్టీ పార్లమెంట్ కమిటీలోనూ పలు వురు పదవులు దక్కించు కున్నారు. అముడా చైర్మన్‌గా అమలాపురం పట్టణానికి చెందిన అల్లాడ స్వామినాయుడు, ప్రసిద్ధిచెందిన వాడపల్లి దేవస్థానం చైర్మన్‌గా ముదునూరి వెంకట్రాజు (గబ్బర్‌సింగ్) నియ మితులయ్యారు.ఏఎంసీలు, దేవాలయాల పాలకవర్గాల నియామకం జరిగింది.ఉమ్మ డి ఉభ య గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం విజ యం సాధించారు. బీజేపీ నేత సోము వీర్రాజుకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి లభించింది.
ప్రాజెక్టులు.. పరుగులు
కాకినాడ-పుదుచ్చేరి బకింగ్ హంకెనాల్‌కు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. కాలువ అభివృద్ధికి ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడ బ్ల్యూఏఐ) రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చు కుం ది.తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రూ.100 కోట్లతో చేపట్టిన అఖండగోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. రాజమండ్రి గోదావరి రివర్ ఫ్రంట్ పనులు కొంత వరకూ జరిగాయి.గోదావరిలో పెట్టిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ మూత పడింది. బొమ్మూ రులో సైన్స్ మ్యూజియం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మంచినీటి సమస్య తీర్చడా నికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఈ నెల 20న ఉప ముఖ్య మంత్రి పవన్ పెర వలిలో శంకుస్థాపన చేశారు.