నాలుగేళ్లయినా.. ఇంతేగా!
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:03 AM
జిల్లాలను హడావుడిగా విభజించారు..వదిలేశారు. కనీస సౌకర్యాలు లేవు.. ఏదో ఉన్నాం చేస్తున్నాం అన్నట్టే ఉంది పరిస్థితి.
పాత భవనాల్లోనే సర్దుబాటు
కొత్త కార్యాలయాల ఊసేలేదు
అధ్వానంగా కలెక్టరేట్ ప్రాంగణం
ఐటీసీ భవనంలో మరికొన్ని ఆఫీస్‌లు
పలు శాఖల విభజన జరగలేదు
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
జిల్లాలను హడావుడిగా విభజించారు..వదిలేశారు. కనీస సౌకర్యాలు లేవు.. ఏదో ఉన్నాం చేస్తున్నాం అన్నట్టే ఉంది పరిస్థితి. నాడు వైసీపీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు చాలా గొప్ప గా చెప్పుకుందే కానీ..కనీసం కలెక్టరేట్‌కు ఒక కొత్త భవనం కూడా నిర్మించలేదు. ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డివిజన్లతో ఏర్పడడంతో అధికారాలు బదలా యింపులో కొంత సమస్య కొనసాగు తోంది. ఎక్సయిజ్ శాఖ విభజన పూర్తిగా జరగలేదు. రాజమహేంద్రవరం డిపో పరిధిలో రాజమహేంద్రవరం, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొంత ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం ఉంది. చాగల్లు ఎక్సయిజ్ డిపో పరిఽధిలో కూడా సమస్య ఉంది. ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ప్రధాన కార్యాలయాలు కాకినాడలోనే ఉన్నాయి. జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) విభజన జరగలేదు. జడ్పీటీసీలు, ఉమ్మ డి జిల్లా ఎమ్మెల్యేలు జడ్పీ సమా వేశానికి ఇప్పటికీ కాకినాడ వెళుతున్నారు.కొవ్వూరు డివిజన్‌లో జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు ఏలూరు జడ్పీకి వెళ్లాల్సి వస్తోంది. కలెక్టరేట్‌కు బస్ సౌకర్యం అందుబాటులో లేదు. వచ్చే ఏప్రిల్ నాటికి కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు పూర్త వుతుంది. అప్పట్లో వైసీపీ చేసిన నిర్వాకం ఇంకా వెంటా డుతూనే ఉంది. తెలుగు దేశం కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యస్థీ కరణ చేపట్టడంతో తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులు మారుతు న్నాయి.ఈ నెలాఖరుకి మండపేట నియోజక వర్గం పరిధిలోని మూడు మండలాలు కలవ నుండడంతో జిల్లా హద్దులు మారనున్నాయి.
కలెక్టరేట్‌నూ కట్టలేదు
2022లో ఏప్రిల్ 4న ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలోని రాజమ హేంద్రవరం డివిజన్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు డివిజన్లను కలిపి రాజమమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదా వరి జిల్లాను ఏర్పాటు చేశారు. ఏడు నియోజకవర్గాలతో రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏర్పడింది. జిల్లా అంటే ఏర్పాటు చేశారే కానీ ఒక్క భవనమూ కట్ట లేదు. అప్పట్లో కలెక్ట రేట్ ఎక్కడ పెట్టాలనే కంగారు పట్టుకుంది. కానీ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నిర్మించిన నాక్, వైటీసీ భవ నాలే దిక్కయ్యాయి. అక్కడే ఒకపైసా ఖర్చు లేకుండా కలెక్టరేట్ పెట్టేశారు. అప్పటి నుంచి మార్పేమీ లేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ వృత్తుల్లో నైపుణ్యం పెంచడానికి బొమ్మూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ పేరిట నిర్మిం చిన విశాల భవనంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. నాక్‌ను మాత్రం గతంలో హాస్టల్‌గా వాడుకునే భవనానికి తరిమేశారు. గిరిజన యువత శిక్షణకు అదే ప్రాంతంలో నిర్మించిన వైటీసీ ప్రాంగణాన్ని ఖాళీ చేయించి కొన్ని ప్రభుత్వ శాఖలకు అప్పగించారు. వీటిలో బీరు వా కూడా పట్టని పరిస్థితి.బాత్‌రూమ్‌లు పాడైన పరిస్థితి ఇప్పటికీ ఉంది. జిల్లా కలెక్టర్ నివాస భవనం కొత్తదిలేదు. గతంలో ఇక్కడ సబ్- కలెక్టర్ నివాస భవాన్ని కలెక్టర్ నివాస భవ నంగా వాడుతున్నారు. జేసీ కూడా అద్దె ఇం ట్లోనే ఉం టున్నారు. జిల్లా కలెక్టరేట్ తాత్కాలిక మేనని అప్పట్లో ప్రకటించినా ఎక్కడా కొత్త స్థల సేకరణ చేయలేదు. తెలుగుదేశం కూటమి అధి కారంలోకి వచ్చాక కొత్త కలెక్టరేట్ కోసం ధవళేశ్వరం లోని ఇరిగేషన్ స్థలాలను పరిశీలిం చినా కదలికలేదు.