బోగస్‌లే.. కదిలేదిలే!
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:10 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకును మొండిబాకీలు వెన్నాడుతున్నాయి. ఏళ్లకు ఏళ్లు వసూలవక చుక్కలు చూపిస్తున్నాయి. అసలు వస్తాయోరావోనన్నట్టు ఏడిపిస్తున్నాయి. అయితే అత్యధిక బాకీలు బోగస్‌వే ఉండడంతో అధికారులు వీటి వసూలుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. చాలావరకు రికార్డులు కంప్యూటరీకరణ కాకపోవడంతో కాగితాలపై రుణాలు చూపించి బోగస్ వ్యక్తులు అధికంగా డీసీసీబీ డబ్బును మింగేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరిలో రూ.980 కోట్లకు చేరిన డీసీసీబీ మొండిబాకీలు
వసూలు చేయడానికి అధికారుల నానా తంటాలు
వీటిలో బినామీ రుణాలే అధికం కావడంతో ఏంపాలుపోని పరిస్థితి
2019 నాటికి డీసీసీబీ బాకీలు రూ.200 కోట్లే.. వైసీపీ వచ్చాక రూ.980 కోట్లకు
మార్చి సమీపిస్తుండడంతో తొమ్మిది బృందాలతో వసూళ్లకు ప్రణాళిక
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకును మొండిబాకీలు వెన్నాడుతున్నాయి. ఏళ్లకు ఏళ్లు వసూలవక చుక్కలు చూపిస్తున్నాయి. అసలు వస్తాయోరావోనన్నట్టు ఏడిపిస్తున్నాయి. అయితే అత్యధిక బాకీలు బోగస్‌వే ఉండడంతో అధికారులు వీటి వసూలుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. చాలావరకు రికార్డులు కంప్యూటరీకరణ కాకపోవడంతో కాగితాలపై రుణాలు చూపించి బోగస్ వ్యక్తులు అధికంగా డీసీసీబీ డబ్బును మింగేశారు. ప్రధానంగా గత వైసీపీ హయాంలో దొంగ రుణాలు భారీగా నమోదయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి డీసీసీబీ మొండి బాకీలు రూ.200 కోట్ల వరకు ఉంటే, వైసీపీ గద్దె దిగే సమయానికి మొండిబాకీలు రూ.980 కోట్లకు చేరాయంటే ఏస్థాయిలో డీసీసీబీ డబ్బును అప్పటి అధికార పార్టీ నేతలు దిగమింగేశారో అర్థం చేసుకోవచ్చు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాకినాడ కేంద్రంగా పనిచేసే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాం కును మొండిబాకీలు వెన్నాడుతున్నాయి. మూడేళ్లకుపైగా రూ.980 కోట్ల రుణాలు వసూలవక ఎనపీఏలుగా మారాయి. వాస్త వానికి ఏదైనా బ్యాంకు రుణం మంజూరు చేయాలంటే అన్ని రకాల పత్రాలు తీసుకునే అప్పు మంజూరు చేస్తాయి. ఆనక వసూల వకపోతే ఆస్తులు వేలం వేసయినా డబ్బు రాబట్టుకుంటాయి. కానీ డీసీసీబీ రూటే వేరు. అన్నదాతలకు ఈ బ్యాంకు బ్రాంచల ద్వారా వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేస్తుంటుంది. అయితే అనేకమంది రైతులు తమ భూమి పత్రాలు చూపించి లక్షల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచల్లో రుణాలు తీసుకుంటారు. వీరి విష యంలో అధికారులు సవాలక్ష నిబంధనలు అమలుచేస్తారు. కానీ పలుకుబడి కలిగిన రాజకీయ నేతల విషయంలో మాత్రం వారు సూచించిన వ్యక్తుల విషయంలో పెద్దగా నిబంధనలు పాటించకుండా చూసీచూడన ట్టు వ్యవహరిస్తారు. ఇక్కడే డీసీసీబీ డబ్బు దొంగరుణాల ద్వారా బయట వ్యక్తుల పర మవుతోంది. ప్రధానంగా పలు బ్రాంచల్లో సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలిపి బోగస్ రుణాలు జారీచేసి కోట్లకుకోట్లు గడచిన కొన్నేళ్లలో స్వాహా చేసేశారు. దొంగ పత్రాలు చూపించి, లేని భూములను రికార్డుల్లో చూపించి కోట్లకుకోట్లు రుణాలు మంజూరు చేసి తలాకొంచెం పంచుకు తినే శారు. ప్రధానంగా కిర్లంపూడి సొసైటీలో రూ. 104 కోట్ల అవినీతి ఈ ఏడాది బట్టబయలైం ది. రాజకీయ ప్రమేయంతో గత కొన్నేళ్లుగా మూలనపడ్డ విచారణను కూటమి ప్రభుత్వం రాగానే వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో పెద్దాపురం డివిజనల్ సహకార అధికారి పద్మ విచారణ జరిపి ఈ ఏడాది జనవరిలో జిల్లా సహకార అధికారికి పూర్తిస్థాయి నివేదిక అం దించారు. ఇందులో సొసైటీ సీఈవోలు, మేనే జర్లు, సూపర్‌వైజర్లు అంతా కలిపి ఈ అవినీ తికి పాల్పడ్డారని నివేదికలో గుర్తించారు. అలా గే ఏలేశ్వరం సొసైటీ పరిధిలోను ఇలాగే బోగస్ రుణాలు మంజూరు చేశారు. బ్యాంకు కాగి తాలపై ఉన్న రుణం తీసుకున్న వ్యక్తుల పేర్ల ఆచూకీ కూడా కనిపించడం లేదు. ఇలా ఎక్క డికక్కడ బ్యాంకు డబ్బును అక్రమార్కులు కాజే శారు. డీసీసీబీ బ్రాంచల్లో రికార్డులు కంప్యూ టరీకరణ కాకపోవడాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ గత అయిదేళ్ల పాలనలో అడ్డగోలుగా మింగే శారు. మరో మూడు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సం వత్సరం ముగియనున్న నేపథ్యంలో మొండిబా కీల లెక్కలు తేల్చడానికి కసరత్తు ప్రారభించిన అధికారులు ఈనెల 3 నాటికి ఉమ్మడి జిల్లాలో బ్రాంచల వారీగా మొండిబాకీలు లెక్కలు తేల్చ గా కళ్లుబైర్లు కమ్మే అంకెలు తేలాయి. ఉమ్మడి జిల్లాలోని 53 డీసీసీబీ బ్రాంచల్లో కలిపి ఎనపీ ఏ బాకీలు రూ.980.72 కోట్లు తేల్చారు. ఇందు లో అత్యధికంగా ప్రత్తిపాడు బ్రాంచలో రూ.332 కోట్లు బాకీ తేలింది. ఇవన్నీ మూడు నుంచి ఐదేళ్ల మధ్య ఇచ్చిన బాకీలే ఉన్నట్టు గుర్తిం చారు. వాస్తవానికి రూ.332 కోట్ల బాకీలకు సం బంధించి రుణం తీసుకున్న వ్యక్తులు డబ్బుల క్రమం తప్పకుండా చెల్లించకపోతే అధికారులు అప్రమత్తం కావాలి. తక్షణం రుణ వసూలుకు సంబంధించి ఆస్తుల వేలం వరకు వెళ్లాలి. కానీ ఇదేదీ జరగలేదు. అలాగే ఏలేశ్వరం బ్రాంచలో రూ.173 కోట్లు మొండి బాకీగా తేలింది. దీనిపై విచారణకు అడుగులు పడగా, తదుపరి విచా రణ లేకుండా కొందరు అడ్డుకున్నారు. ఈ బాకీ ల్లో 80 శాతానికిపైగా బోగస్ రుణాలే. జగ్గం పేట బ్రాంచలో రూ.72కోట్లు, అన్నవరం రూ. 45.53 కోట్లు, గోకవరం రూ.18కోట్లు, మండపేట రూ.12.29 కోట్లు చొప్పున పేరుకుపోయాయి. ఇవన్నీ దాదాపుగా గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసినవే ఉన్నాయి. సాధారణంగా నిజమైన రైతులు రుణాలు తీసుకుంటే ఎంత కష్టమైనా తిరిగి చెల్లిస్తారు. ఎన్నేళ్లయినా వసూ లవడం లేదంటేనే తిరకాసు ఉన్నట్టు. మరోపక్క మొండిబాకీలు ఆలమూరు బ్రాంచలో రూ.3.74 కోట్లు, అల్లవరం రూ.2.24 కోట్లు, అమలాపురం రూ.2.91 కోట్లు, అంబాజీపేట రూ.1.38 కోట్లు, అన్నవరం రూ.45.53 కోట్లు, ఆత్రేయపురం రూ. 6.86 కోట్లు, దానవాయిపేట రూ.4.78 కోట్లు, ద్రాక్షారామ రూ.7.89 కోట్లు, గండేపల్లి రూ. 22.56 కోట్లు, గోకవరం రూ.18.91కోట్లు, గొల్లపా లెం రూ.6.23 కోట్లు, కె.గంగవరం రూ.2.59 కోట్లు, కడియం రూ.2.94 కోట్లు, కరప రూ. 3.01 కోట్లు, కాట్రేనికోన రూ.6.70 కోట్లు, కోరు కొండ రూ.8.74కోట్లు, మలికిపురం రూ.2.66 కోట్లు, మామిడికుదురు రూ.2.81 కోట్లు, మం డపేట రూ.12.29 కోట్లు, ముమ్మిడివరం రూ. 4.96కోట్లు, నాగమల్లితోట రూ.3.94కోట్లు, పి. గన్నవరం రూ.3.13కోట్లు, పెద్దాపురం రూ. 43.97 కోట్లు, పిఠాపురం రూ.23.32 కోట్లు, రఘుదేవపురం రూ.37.97 కోట్లు, రాజమహేంద్రవరం రూ.6.48కోట్లు, రాజానగరం రూ.11. 27 కోట్లు, రంపచోడవరం రూ.16.14 కోట్లు, రంగంపేట రూ.10.98 కోట్లు, రాయవరం రూ.11.40కోట్లు, సామర్లకోట రూ.5.18 కోట్లు, తుని రూ.16.18కోట్లు, యు.కొత్తపల్లి రూ.9.95 కోట్లు మొండిబాకీలుగా తేల్చారు. వీటి వసూ లుకు తాజాగా 9బృందాలను ఏర్పాటుచేశారు.