సెల్యూట్ ‘కీర్తి’
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:29 AM
సాయుధ దళాల జెండా దినోత్సవం 2024-25 సందర్భంగా విరాళాల సేకరణ విషయంలో తూర్పు గోదావరి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం
ప్రశంసాపత్రం అందజేసిన గవర్నర్
రాజమహేంద్రవరం, డిసెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): సాయుధ దళాల జెండా దినోత్సవం 2024-25 సందర్భంగా విరాళాల సేకరణ విషయంలో తూర్పు గోదావరి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ఈ ప్రశంస దక్కిందని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. జిల్లాలోని డ్వామా, డీఆర్డీఏ, మెప్మా సంస్థల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు స్వచ్ఛందంగా రూ.10 చొప్పున విరాళం అందిం చడం అభినందనీయమన్నారు. మొత్తం రూ.12,73,105 సమకూరిందని చెప్పారు. ఈ నిధిని వీరమరణం పొందిన సైనికుల కుటుం బాలు, గాయపడిన సైనికులు, మాజీ సైని కులు, వారి ఆధారితుల పునరావాసం, సంక్షే మానికి వినియోగిస్తారన్నారు. విరాళం అందిం చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా మని కలెక్టర్ పేర్కొన్నారు. అమరావతి లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రా న్ని కలెక్టర్ కీర్తి జిల్లా తరపున స్వీకరించారు. పలువురు అభినందనలు తెలిపారు