Share News

ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షకు 2,202 మంది హాజరు

ABN , Publish Date - May 25 , 2025 | 12:50 AM

జేఎన్టీయూకే, మే 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్‌-2025 ఇంజనీరింగ్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష శనివారం కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ప్రశాంతంగా జరిగిందని కన్వీనర్‌ వీవీ సుబ్బారావు తెలిపారు. మూడు జిల్లాల్లోని తొమ్మిది కేంద్రాల్లో ఉద

ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షకు 2,202 మంది హాజరు

కన్వీనర్‌ వీవీ సుబ్బారావు

జేఎన్టీయూకే, మే 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్‌-2025 ఇంజనీరింగ్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష శనివారం కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ప్రశాంతంగా జరిగిందని కన్వీనర్‌ వీవీ సుబ్బారావు తెలిపారు. మూడు జిల్లాల్లోని తొమ్మిది కేంద్రాల్లో ఉదయం 9నుంచి 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 2,296 మంది విద్యార్థులకు 2,202 మంది హాజరుకాగా 94 మంది గైర్హాజరయ్యారు. కాకినాడ జి ల్లాలో 95.67శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 96.17 శాతం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 95. 78 శాతం హాజరు నమోదైంది. ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు ఆదివారం కూడా కొనసాగుతాయి. ఏపీ ఇంటర్‌ రెగ్యులర్‌ విద్యార్థులు మినహా సీబీఎస్‌, ఐసీఎస్‌ ఈ, ఏపీవోఎస్‌ఎస్‌, ఎన్‌ఐవోఎస్‌, డిప్లొమా, ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు తమ ఇంటర్‌ మార్కులను ఏపీఈఏపీసెట్‌ జ్ట్టిఞట://ఛ్ఛ్టిట.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా డిక్లరేషన్‌ ఫారంలో ఈనెల 30వ తేదీలోపు అప్‌లోడ్‌ చేయాలని కన్వీనర్‌ సూచించారు.

Updated Date - May 25 , 2025 | 12:50 AM