Share News

నకిలీ ఎస్‌ఐ అరెస్టు

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:49 AM

లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బు లు వసూలు చేస్తున్న నకిలీ ఎస్‌ఐను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ కె.శ్రీహరిరావు తెలిపారు.

నకిలీ ఎస్‌ఐ అరెస్టు
నకిలీ ఎస్‌ఐ సంజయ్‌రాజు

కొవ్వూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బు లు వసూలు చేస్తున్న నకిలీ ఎస్‌ఐను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ కె.శ్రీహరిరావు తెలిపారు. మేడ్చల్‌ జిల్లా దూలపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సంతోష్‌ హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నుంచి ఐషర్‌ వ్యాన్‌పై ఈ నెల 16వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో ఒక మాల్‌ వద్దకు వచ్చి వాషింగ్‌ ఫౌడర్‌ లోడ్‌ దిగుమతి చేసి వెళుతూ కొవ్వూరు మండలం గోవర్ధనగిరిమెట్టలోని జియో పెట్రోల్‌ బంకు వద్ద నిద్రకు ఉప క్రమించాడు. 17వ తేదీ ఉదయం ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గొడౌన్స్‌ ప్రాంతం లోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సరేళ్ళ సంజయ్‌రాజు హోండాషైన్‌ బైక్‌పై పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ డ్రెస్‌ వేసుకుని చేతిలో మ్యాన్‌ప్యాక్‌ పట్టుకుని వచ్చి రోడ్డు ప్రక్కన వ్యాన్‌ ఎందుకు ఆపావు. రికార్డు చూపించమన్నాడు. రికార్డు చూసి సరిగాలేదని డ్రైవర్‌ సంతోష్‌ను బెదిరించి స్టేషన్‌కు పద అని కొంతదూరం తీసుకెళ్లి రూ.2 వేలు నగదు తీసుకుని డ్రైవర్‌ను వదిలిపెట్టి కొవ్వూరువైపు వెళ్లిపోయాడు. వ్యాన్‌ డ్రైవర్‌ సంతోష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.డీఎస్పీ దేవకుమార్‌, సీఐ కె.విజయబాబుల పర్యవే క్షణలో నకిలీ ఎస్‌ఐ సంజయ్‌రాజును గురువారం పోలీసులు అరెస్టుచేసి కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. సంజయ్‌రాజుపై గతంలో రాజమహేంద్రవరం-1,3 రాజానగరం, రావులపా లెం, శ్రీకాకుళం, ఏఆర్‌ పురం ప్రాంతాల్లో పలు కేసులున్నట్టు సమాచారం.

Updated Date - Sep 19 , 2025 | 12:49 AM