Share News

కానరాని ప్రమాదం

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:07 AM

గుండు గొలను, కొవ్వూరు రహదారి నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు తరచూ జరుగు తున్నాయి. ఏలూరు నుంచి కాకినాడ వెళ్తున్న బియ్యం నూకల లోడుతో వెళ్తున్న లారీ దేవర పల్లి, దుద్దుకూరు మధ్యలో ఉన్న పోలవరం కాల్వలోకి దూసుకెళ్లింది. అయితే లారీ కాల్వ మధ్యలో ఉన్న వంతెన పిల్లర్‌ సమీపంలోకి వెళ్లి ఆగడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

కానరాని ప్రమాదం
మంగళవారం దేవరపల్లి-దుద్దుకూరు మధ్య పోలవరం కాల్వలోకి దూసుకెళ్లిన లారీ

  • దుద్దుకూరు-దేవరపల్లి వద్ద హైవేపై బందపురానికి అండర్‌పాస్‌

  • పోలవరం కాల్వ దగ్గరగా సర్వీస్‌ రోడ్డు వేసి వదిలేసిన వైనం

  • హెచ్చరిక బోర్డులు పెట్టని హైవే అధికారులు

  • తరచూ కాల్వలోకి దూసుకెళ్తున్న చిన్న, భారీ వాహనాలు

దేవరపల్లి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): గుండు గొలను, కొవ్వూరు రహదారి నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు తరచూ జరుగు తున్నాయి. ఏలూరు నుంచి కాకినాడ వెళ్తున్న బియ్యం నూకల లోడుతో వెళ్తున్న లారీ దేవర పల్లి, దుద్దుకూరు మధ్యలో ఉన్న పోలవరం కాల్వలోకి దూసుకెళ్లింది. అయితే లారీ కాల్వ మధ్యలో ఉన్న వంతెన పిల్లర్‌ సమీపంలోకి వెళ్లి ఆగడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు సంవత్సరాల క్రితం ఈ కాల్వలో లారీ దూసుకెళ్లి డ్రైవర్‌ మృతి చెందాడు. అలాగే నెల క్రితం ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదాలన్నీ కాల్వ ప్రవహించక ముందు జర గడం వల్ల ప్రమాదాల ముప్పు నుంచి తప్పిం చుకున్నారు. ఈ కాల్వ ప్రవహించే సమయంలో అయితే ఘోరప్రమాదాలు జరిగేవి. గుండుగొల ను నుంచి కొవ్వూరు వరకు యర్నగూడెం వద్ద పోలవరం కాల్వ సమీపం వచ్చేటప్పటికి సర్వీ సు రోడ్డును జాతీయ రహదారిలో కలిపారు. దుద్దుకూరు, దేవరపల్లి మధ్య ఉన్న పోలవరం, తాడిపూడి కాల్వ పైన వంతెన నిర్మాణం చేసిన ప్పటికీ సర్వీస్‌ రోడ్డు బందపురం వెళ్లడానికి అండర్‌పాస్‌ ఇచ్చారు. ఇదే సర్వీస్‌ రోడ్డు పోల వరం కాల్వ దగ్గరగా వేసి వదిలేశారు. కాల్వకు అడ్డంగా గోడ నిర్మాణం చేసి ఉంటే ఈ ప్రమా దాలు జరిగేవి కావు. పోలవరం, తాడిపూడి కా ల్వపై సర్వీసు రోడ్డు నిర్మాణం చేసినా ఈ ఘట నలు జరిగేవి కావు. పోలవరం కాల్వ సమీపానికి వచ్చే వరకు రోడ్డులేదనే విషయం తెలియక కాల్వలోకి దూసుకెళ్లిపోతున్నారు. కనీసం అక్కడ హైవే సంబంధించిన అధికారులు లైట్లు ఏర్పా ట్లు కానీ, రోడ్డు క్లోజ్‌ అనే బోర్డు కానీ కనిపిం చవు. తాత్కాలికంగా కాల్వ వద్ద అడ్డుగా కమ్మె లతో ఏర్పాటు చేసినప్పటికి ఈ కాల్వలో దూ సుకెళ్లినప్పుడు అవి తొలగిపోతున్నాయి. పోలవ రం, తాడిపూడి కాల్వపై సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని బంధపురం, దేవరపల్లి, దుద్దుకూరు గ్రామస్థులు, వాహనదారులు కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ కాల్వ సుమారు 50అడుగు లు లోతు ఉండడం వల్ల సర్వీసు రోడ్డు బాగా డౌన్‌గా ఉండటం వాహనాలు అదుపు తప్పి కంట్రోల్‌ కాకపోవడంతో కాల్వలోకి వెళ్లిపోతు న్నాయి. మోటార్‌సైకిల్‌ ప్రమాదాలు కూడా అనేకం జరిగాయి. ప్రారంభంలోనే రోడ్డు క్లోజ్‌ అని పెద్దబోర్డులు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు అడ్డంగా వేగనిరోధకలు ఏర్పాటు చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 01:07 AM